Home / Entertainment / చాలా కొత్తగా తుంటరి ట్రైలర్

చాలా కొత్తగా తుంటరి ట్రైలర్

Author:

బాణం, సోలో,సారొచ్చారు, ప్ర‌తినిధి, రౌడీఫెలో వంటి సినిమాల‌తో త‌న‌దైన మార్కుతో దూసుకెళ్తున్న నారా రోహిత్‌, లత హెగ్డె హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా తుంటరి. గుండెల్లో గోదారి, జోరుతో సినిమాలతో దర్శకుడుగా గుర్తింపు పొందిన కుమార్‌ నాగేంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళ దర్శకుడు మురుగదాస్‌ కథతో రూపొందిన మాన్‌ కరాటే తమిళ సినిమాకు రీమేక్‌, ఈ సినిమా జరగబోయే విషయాలు ముందుగానే తెలిస్తే ఎలా ఉంటుందనే కథతో చాలా ఆసక్తిగా,థ్రిలింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన నారా రోహిత్ లుక్‌ మంచి స్పందనను రాబట్టుకుంది.

రోహిత్ ఎలాంటి తుంటరి వేషాలు వేశాడో చూపిస్తు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో ఒక్క డైలాగ్ లేకుండా చాలా స్టైలిష్ గా చూపించారు. రోహిత్‌ను చాలా కొత్తగా చూపించారని చూస్తే తెలిసిపోతుంది. మనోడు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నడని వినికిడి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

రోహిత్ తదుపరి సినిమాలు శంకర, సావిత్రి, పండగలా వచ్చాడు, అప్పట్లో ఒకడు ఉండేవాడు, వీరుడు, కథలో రాజకుమారి, జో అచ్యుతానంద, రాజా చెయ్యేస్తే, వాడే వీడు, ఈ సినిమాలన్నీ నారా రోహిత్ నటిస్తున్న కొత్త సినిమాలు. ఓకేసారి పది సినిమాలను సెట్స్ పై వుంచిన ఈ యంగ్ హీరో…

Comments

comments