EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

జాతి నాయకుని జన్మదినం

Author:

నరేంద్ర మోడీ 1950, సెప్టెంబర్ 17న గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని వాద్‌నగర్‌లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోడి గుజరాత్ విశ్వవిద్యాలయం నుంచి రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడిగా పనిచేశారు. 1970లలో విశ్వ హిందూ పరిషత్తుచేరారు. గుజరాత్‌లోని ఒక మారుమూల గ్రామం నుంచీ దిల్లీ పీఠం దాకా ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది.శాసనమండలి సభ్యుడిగా, గుజరాత్ రాష్ట్ర మంత్రిగా, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎదుగుతూనే భారతదేశ ప్రధానమంత్రి పదవి అధిష్టించారు.

1998లో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించబడ్డారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో భాజపా విజయం సాధించటం లో మోడీ ముఖ్య  పాత్ర వహించారు.దాంతో పార్టీలో సీనియర్ నాయకుడైన కేశూభాయి పటేల్ గుజరత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో గుజరాత్‌లో సంభవించిన పెను భూకంపం తర్వాత సహాయ కార్యక్రమాలు చేపట్టడంలో కేశూభాయి ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శించడంతో భాజపా నాయకత్వం 2001 అక్టోబర్లో నరేంద్ర మోడిని గుజరాత్ ముఖ్యమంత్రి పీఠంపై అధిష్టించింది. అప్పటి నుంచి మే 21, 2014 నాడు ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు వీలుగా రాజీనామా చేసేవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా మోడీనే కొన సాగారు.

ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన ఏడాదిలోనే ఎవరూ ఊహించని అభివృద్దిని ఆయ సాధించాడంటారు.గుజరాత్ చరితరలోనే ఒక పెను ప్రమాదం గా పేరుపడ్ద భూకంపం వల్ల నష్టపోయిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టి హిందువులకోసం చాలా కృషి చేసారు. 2002లో గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ దహనం తర్వాత జరిగిన అల్లర్లు ఇటు జనానికీ అటు మోడీ ప్రభుత్వానికీ తీరని నస్ఝ్టం చేసాయి. దేశ వ్యాప్తంగా ఆయన రాజీనామా చేయాలని విమర్శలు రావడంతో రాజీనామా సమర్పించి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.

2002 డిసెంబర్లో జరిగిన గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మళ్ళీ అయనే ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తం 182 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీకి 126 స్థానాలు సంపాదించి పెట్టటం లో మోడీ కష్టం ఎవరూ కాదనలేనిది. 2002 గుజరాత్ అల్లర్లపై రాజకీయంగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయ్… మోడీ ని రాక్షసుడు అన్నాయ్…కానీ..! మొడీ బెదరలేదు గుజరాత్ రాష్ట్రాన్ని బలోపేతం చేసి “కుక్కపిల్ల(పప్పి) కారు చక్రం కింద పడి మరణిస్తే బాధ పడతాం…డ్రైవింగ్ సీటులో ఉన్నా, వెనుక కూర్చున్నా అంతే ఫీలవుతాం…,గోద్రా ఘటనకు ఒక ముఖ్యమంత్రిగా నేను పశ్చాత్తాప పడటం లేదు అది జరగ వలసిన పరిణామమే” అంటూ ఎదురు తిరిగిమరీ మంచి ఉత్తమమైన పరిపాలన కార్యశీలిగా పేరుతెచ్చుకున్నారు.

(Visited 128 times, 39 visits today)