Home / health / ఈ పద్దతులతో రాలిపోయిన జుట్టుని తిరిగి పొందవచ్చు..!!

ఈ పద్దతులతో రాలిపోయిన జుట్టుని తిరిగి పొందవచ్చు..!!

Author:

బట్టతల కనీసం కల్లో వచ్చినా భయంగానే ఉంటుంది. తల్లోంచి ఒక్కొక్క వెంట్రుక రాలుతూంటే ఒక్కోప్రాణం పోయినట్టుగానే ఉంటుంది. బట్టతల వల్ల ఎంతోమంది ఆత్మవిశ్వాసం కోల్పోయి తమ కెరీర్ లలోనూ వెనుకబడుతున్నారట. మనిషి అందంలో ప్రధాన పాత్ర పోషించే తలకట్టు చూస్తూండగానే మైదానం గా మారిపోతూంటే ఆ భాద అనుభవించిన వారికే తెలుస్తుంది. అయితే ఇప్పుడు మీకొక ఊరట కలిగించే మాట ఏమిటంటే పూర్తిగా తలమీద స్టేడియం అయిపోతే ఏం చేయలేం గానీ కొంతలో కొంత రాలిన జుట్టూ స్థానం లో ఉంటే మాత్రం దాన్ని అరికట్ట టానికి కొన్ని టెస్ట్ చేసిన సొల్యూషన్స్ ఇప్పుడు మీ ముందుకు వచ్చాయి. పోయిన జుట్టుని(మొత్తం బట్టతల అయ్యాక కాదు) మళ్లీ తిరిగి పొందడానికి, బట్టతలపై జుట్టు మొలిపించడానికి సింపుల్ అండ్ న్యాచురల్ రెమిడీస్ ఉన్నాయి. ఇవి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయని ప్రూవ్ కూడాఅయింది అంటూ ఆయుర్వేద వైద్యులు బల్ల గుద్దిమరీ చెబుతున్నారు కాబట్టి.. ఈ టిప్స్ ఫాలో అవండి. ఓ సారి ట్రై చేసి చూస్తే ఏం పోయిందీ…! కాబట్టీ ఈ టిప్స్ పాటించి ఒత్తైన, పొడవైన, బలమైన, ఆరోగ్యకరమైన జుట్టుని పొందండి. జుట్టు తో పాటూఅత్మ విశ్వాసమూ పెంచుకోండి.. ఆ టిప్స్ ఏమిటంటే?

natural-tips-for-hair-growth

  • ఒక ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి, రసం తీయండి. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తల మాడుకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రీగ్రోత్ అవడానికి సహాయపడుతుంది.
  • జుట్టు మొలిపించడానికి ఆముదం, ఆమ్లా ఆయిల్ చాలా అమేజింగ్ గా పనిచేస్తాయి. ఆముదం, ఉసిరి ఆయిల్ ని సమానంగా తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట తలపై బాగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే షాంపూ, కండిషనర్ ఉపయోగించే తలస్నానం చేయాలి. ఈ ట్రీట్మెంట్ ని వారానికి రెండుసార్లు ఫాలో అయితే.. బలమైన, హెల్తీ హెయిర్ మీ సొంతమవుతుంది. అలాగే డాండ్రఫ్ నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.
  • 6 లేదా 7 ఎండిన ఉసిరికాయలను 2 కప్పుల వేడినీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటి లోంచి ఉసిరికాయలను తీసి గుజ్జు తీయాలి. ఈ గుజ్జులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె కలిపి తలకు పట్టించాలి. ఇది అప్లై చేశాక షవర్ క్యాప్ తో తలను కవర్ చేసుకుని 30 నిమిషాలు వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ తలలో జుట్టు రీగ్రోత్ అవ్వడానికి ఛాన్సు ఎక్కువగా ఉంటుంది..
  • జుట్టు సంరక్షణలో మందారం పువ్వు చాలా మ్యాజికల్ గా పనిచేస్తుంది. ఈ టిప్ ఫాలో అవడం కూడా చాలా సింపుల్. గుప్పెడు మందారం పువ్వులు తీసుకుని పేస్ట్ చేయాలి. దీనికి ఆముదం లేదా బ్రింగరాజ్ ఆయిల్ ఏది అందుబాటులో ఉంటే దాన్ని కలిపి తల మాడుకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే.. మీ పొట్టి జుట్టు మంచి క్రాఫ్ గానో లేదంటే వాలు జడగానో మారిపోతుంది. మరో సారి ట్రై చేసి చూడండి.

Must Read: సహజంగా పొట్టని తగ్గించుకోవడానికి సులువైన చిట్కా..!

(Visited 18,389 times, 60 visits today)