Home / health / న్యాచురల్ ఆయిల్ తో జుట్టు రాలటాన్ని తగ్గిచుకోండి.

న్యాచురల్ ఆయిల్ తో జుట్టు రాలటాన్ని తగ్గిచుకోండి.

Author:

మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఈ కాలుష్యానికి రాలిపోతున్న జుట్టును చూసుకోని భాదపడుతూంటాం. ఇప్పుడు దాదాపుగా మనలో సగం మంది భాద ఇదే. ఏవేవో మందులూ, షాంపూలూ, డాక్టర్ల సలహాలూ ఇలా ఎన్నొ రకాలుగా రాలిపోయే జుట్టుని నిలుపుకోవటానికి ప్రయత్నిస్తూనే ఉండి ఉంటారు కదా… అయితే మీకో విషయం తెలుసా..? ఆముదమా అని మనం మొహం చిట్లించుకొనే క్యాస్టర్ ఆయిల్ మీ సమస్యని చిటికెలో నివారించగలదు… అంతే కాకుండా, జన్యుపర లోపాల వలన, అనారోగ్యకర ప్రణాళికలను పాటించే వారిలో, ఒత్తిడి, మానసిక కారణాల మారియు జీవనశైలిలో లోపల వలన కలిగే బట్టతలను తగ్గించుటకు చికిత్సగా కూడా వాడే క్యాస్టర్ ఆయిల్ ను ఆహార తయారీలో వాడటం వల్ల జుట్టు రాలటం తగ్గి, వత్తుగా మారుతుంది. మీకు ఆశ్చర్యంగా అనిపించినా ఇదే నిజం.. మీరు వందల రూపాయలు పెట్టికొనే హెయిర్ కేర్ ఉత్పత్తులకన్నా ప్రకృతి ఇచ్చిన అమృతం ఆముదం…

natural-treatment-fall-hair-fall

ఆముదం (క్యాస్టర్ ఆయిల్) వల్ల ఎన్ని ప్రయోజనాలున్నయో తెలుసా..?

 • జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
 • వెంట్రుకలు పలుచగా మారటాన్ని నివారిస్తుంది.
 • జుట్టు ప్రమాదానికి గురవటాన్ని తగ్గిస్తుంది.
 • పొడి జుట్టుకు కావాల్సిన పోషకాలను అందించి మరియు ప్రకాశవంతంగా కనపడేలా చేస్తుంది.
 • ప్రకాశవంతంగా మార్చి, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
 • జుట్టు మొదళ్ళ నుండి చివరి వరకు తేమను అందించి పరిస్థితిని మెరుగుపరుస్తుంది.
 • తలపై చర్మం పొడిగా మారటాన్ని తగ్గిస్తుంది.

జుట్టు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, క్యాస్టర్ ఆయిల్ ను అప్లై చేయటం వలన ప్రమాదాలను మరియు జుట్టు చివరల తెగటాన్ని నివారిస్తుంది. జుట్టుకు గమనించదగిన బలాన్ని కూడా చేకూరుస్తుంది. జుట్టు రాలటాన్ని తగ్గించి, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంచుతుంది

వెంట్రుకల ఆరోగ్యానికి క్యాస్టర్ ఆయిల్ ను ఎలా వాడాలి?

 • చేతి వేళ్ళ కొనల సహాయంతో, మంచి నాణ్యత గల క్యాస్టర్ ఆయిల్ ను వెంట్రుకల మొదళ్ళ నుండి చివరి వరకు అప్లై చేయండి.
 • అప్లై చేసే క్యాస్టర్ ఆయిల్ తలపై చర్మానికి కూడా చేరాలి ఈ ప్రక్రియ మొత్తం మీ చేతి వేళ్ళ ద్వారానే జరగాలి.
 • మరీ ఎక్కువగా తలమీద పోయవద్దు ఎందుకంటే, మరీ ఎక్కువగా వేస్తే వలన జుట్టు నుండి తొలగించటం కూడా కష్టమే.
 • క్యాస్టర్ ఆయిల్ వెంట్రుకలకు అప్లై చేసిన తరువాత, ప్లాస్టిక్ క్యాప్ తో కప్పండి లేదా టవల్ తో చుట్టి ఉంచండి.
 • ఇలా ఆయిల్ 15 నుండి 20 నిమిషాల పాటూ ఉంచండి లేదా రాత్రంతా అలానే ఉంచినా సరే  తరువాత మంచి షాంపూతో జుట్టును కడిగి వేయండి.
 • రసాయనాలు ఎక్కువ లేని మైల్ద్ షాంపూ అయితే మరీ మంచిది.ఇలా 8 వారాల పాటూ, వారానికి ఒకసారి చేసి ఫలితాలను గమనించండి.

కేవలం క్యాస్టర్ ఆయిల్ మాత్రమే కాకుండా, దీనిని ఇతర నూనెలు అనగా ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనెలో కలిపి కూడా వాడవచ్చు. ఇలా చేయటం వల్ల మరీ జిడ్డుగా ఉండే భాద ఉండదు.క్యాస్టర్ ఆయిల్ ను క్రమంగా వాడటమే కాకుండా, జుట్టు ఆరోగ్యానికి కావలసిన ఆరోగ్యకర ఆహారాలను మరియు పోషకాలు అధిక మొత్తంలో ఉన్న ఆహారాలను తినటం తప్పని సరి. సరైన సమయం పాటూ విశ్రాంతి, రోజు వ్యాయామాలు మరియు ఒత్తిడిని అధిగమించే ధ్యానం వంటి వాటిని అనుసరించటం వలన జుట్టు పొడవుగా, మందగా మరియు బలంగా ఉంటుంది.

Must Read: తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు ఇవి చేయండి.

(Visited 5,578 times, 39 visits today)