EDITION English తెలుగు
ధోని భార్యపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్న ఫాన్స్..! పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయొద్దు.?   మెట్రోలో ఎదురుగా ఉన్న అమ్మాయి దిగేటప్పుడు ఏమనిందో తెలుసా.? దెబ్బకు ట్రైన్లో అందరు షాక్!   ఈరోజే ముక్కోటి ఏకాదశి..! ప్రతి ఒక్కరు ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం, అందరికి తెలియజేయండి.   "మనోజ్ అన్నా నువ్వు కూడా ఆ ముగ్గురిలా ఏదైనా వదులు" అంటే మనోజ్ ఇచ్చిన కౌంటర్ హైలైట్!   వివాదంగా మారిన కేసీఆర్ ఫ్లెక్సీ..పెట్టినవెంటనే తొలగించారు..! ఎందుకో తెలుసా.?   ఏడాది పాటు స్మార్ట్ ఫోన్ వాడకుండా ఫీచర్ ఫోన్‌ వాడితే రూ.72 లక్షలు మీవే.! ఎలా పొందాలంటే.?   తెరాస కు ఆంధ్రాలో నిజంగానే ఫాలోయింగ్ ఉందా.? ఆంధ్ర రాజకీయాల్లో నిజంగానే అడుగుపెడతారా.?   "నా పేరు శివ. నేను చేసిన పనే మీరు చేస్తే తిప్పలు తప్పవు" అంటూ ఒకరు పంపిన మెసేజ్ ఇది!   లిటిల్ సోల్జర్స్ లో నటించిన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.? ఆమె బాక్గ్రౌండ్ ఇదే.!   ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అతను ఏం చేసాడో తెలుసా.? కరెక్ట్ అంటారా.?
Home / Entertainment / మాస్ గా హాట్ బ్యూటి

మాస్ గా హాట్ బ్యూటి

Author:

thirunaal

డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ ‘మనస్సినక్కరే’ అనే సినిమాలో హీరోయిన్‌గా నయన్ కు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ముందు సినిమాల్లోకి వెళ్లద్దనుకున్నా కేవలం ఒక్క సినిమాలో చేద్దామనుకొని కెరీర్ ప్రారంభించింది నయనతార. ఆ తర్వాత ‘విస్మయతుంబట్టు’, ‘తస్కర వీరన్’, ‘రాప్పకల్’ వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది. తమిళంలో ‘అయ్య’, ‘చంద్రముఖి’, ‘గజిని’ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన ‘లక్ష్మీ’, ‘బాస్’ చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. 2006లో రిలీజైన ‘ఈ’, ‘వల్లభ’ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి. తర్వాత అజిత్‌తో కలిసి చేసిన ‘బిల్లా’ సినిమా ఆమెకు సెక్సీయెస్ట్ హీరోయిన్‌గా పేరు తెచ్చిపెట్టింది. తెలుగు, తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది నయన్.. బాపు చిత్రం ‘శ్రీరామరాజ్యం’లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను ‘ఫిల్మ్‌ఫేర్’, ‘నంది’ అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి.

thirunaal2

ఇప్పుడు హీరో జీవా, ఈ సౌత్ హాట్ బ్యూటీ జంటగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తిరునాళ్’. ఈ చిత్రానికి పీఎస్.రామనాథ్ దర్శకత్వం వహిస్తుండగా ఎం.సెంథిల్ కుమార్ నిర్మిస్తున్నారు. రాజకీయం, రౌడీయిజం అంశాల మేళవింపుతో ఓ స్కాం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ చిత్రంలో జీవా ఫుల్ మాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు. అదుకు తగిన విధంగా సినిమాలో జీవా లుక్ కనిపించబోతోంది. ఇందులో ఆయన పాత్ర ఓ రౌడీ , పేరు బ్లేడ్.  ఇందులో బ్లేడు ప్రియురాలిగా నటిస్తున్న నయనతార కూడా ఓ సన్నివేశంలో నోట్లోంచి బ్లేడు తీస్తుందట. ఇప్పటికే విడుదలైన ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. లంగా ఓనీలో నయనతార పల్లెటూరి అమ్మాయి లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అంటున్నాడు నిర్మాత సెంథిల్ కుమార్. తన నెక్ట్స్ మూవీ కూడా ఈ ఇద్దరు జంటగా చేయనున్నట్లు తెలిపారు.

(Visited 84 times, 22 visits today)