అన్నదాత కష్టాన్ని అద్భుతమైన పాట రూపంలో చెప్పిన చిరంజీవి…!

Author:

మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి ఇప్పటి వరకు 4 పాటలు విడుదల అయ్యాయి, ఆ పాటలన్ని కమర్షియల్ పాటలే, ఆ పాటలని విన్న అందరు సూపర్ ఉన్నాయి అంటూ ఎంజాయ్ చేస్తున్నారు, కానీ ఈరోజు విడుదల చేసిన పాట వింటే కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి, అంత అద్భుతంగా ఉంది ఆ పాట..

“నీరు నీరు నీరు రైతు కంట నీరు.. చూడనైనా చూడరేవ్వరు..! గుండెలన్ని బీడు ఆశలన్నీ మూడు.. ఆదరించు నాధుడెవ్వడు..! అన్నదాత గోడు.. ఆలకించు వారు ఎవ్వరు..!” అంటూ ఉన్న ఈ పాట అన్నదాతలు పడుతున్న కష్టాలని కళ్ళముందు ఉంచుతుంది, మనం హాయిగా కూర్చొని తినే ముద్దని పండించడానికి రైతులు ఎన్ని సమస్యలని ఎదుర్కుంటున్నాడో తెలియజేస్తుంది. ” గొంతు ఎండిపోయే పోగు మండిపోయే గంగతల్లి జాడలేదని..!” అంటూ సాగిపోయే పదాలు రైతు బిడ్డల్లో ఖచ్చితంగా కన్నీళ్లు తెప్పిస్తాయి.

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమా కోసం రైతుల కష్టాలకి సంబంధించిన కథ ఎంచుకున్నాడని మనకి ముందే తెలుసు కానీ ఆ కథ ఎలా ఉండబోతుంది అనేది ఈ పాటతో మనం అర్ధం చేసుకోవచ్చు, తెలుగు ఇండస్ట్రీలో, చిరంజీవి గారి కెరీర్ లో ఈ పాట ఒక అద్భుతమైన పాటగా నిలిచిపోతుంది. ఈ పాట రాసిన రామజోగయ్య శాస్రి గారు , పాడిన శంకర్ మహదేవన్ కూడా చరిత్రలో నిలిచిపోతారు.

(Visited 2,037 times, 219 visits today)