EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

నేనే రాజు నేనే మంత్రి రివ్యూ & రేటింగ్.

జోగేంద్ర నేనే రాజు నేనే మంత్రి

Alajadi Rating

2.75/5

Cast: రానా, కాజల్, క్యాథెరిన్, అశుతోష్ రాణా, పోసాని, నవదీప్, తనికెళ్ళ భరణి..తదితరులు.

Directed by: తేజ

Produced by: సురేష్‌బాబు, కిరణ్‌ రెడ్డి, భరత్‌ చౌదరి

Banner: సురేష్ ప్రొడక్షన్స్, ఫిల్మ్‌ ప్లానెట్‌

Music Composed by: అనూప్ రూబెన్స్

ప్రేమకథలని తీసి తీసి ఫేడవుట్ అయిన సీనియర్ డైరెక్టర్ తేజ, బాహుబలి సినిమాతో పెద్ద స్టార్ అయిపోయిన రానా కలయికలో పొలిటికల్ సబ్జెక్ట్ మీద సినిమా అనగానే అందరు ఆశ్చర్యపోయారు, ఈ సినిమా టీజర్, ట్రైలర్లు చూసి అంచనాలు పెరిగిపోయాయి, డైలాగ్స్, ప్రోమోలతో ప్రేక్షకుల ఆకర్షించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ఈరోజు చాలా అంచనాల మధ్య విడుదల అయింది, మరి ఆ అంచనాలకి అందుకుందో లేదో మీరు తెలుసుకోండి.

కథ:

అనంతపురంలో ఒక వ్యాపారం చేసుకుంటూ ఉండే జోగేంద్ర (రానా దగ్గుబాటి)కి తన భార్య రాధా(కాజల్ అగర్వాల్) అంటే ప్రాణం, తల్లి కాబోతున్న సమయంలో ఊర్లో రాజకీయాల వల్ల రాధా మరణిస్తుంది, ఇది తట్టుకోలేని జోగేంద్ర ప్రతీకారం తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాడు, సర్పంచ్ పదవి నుండి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎదుగుతూ ముఖ్యమంత్రి సీటుపై కన్నేస్తాడు, చివరికి ఏం జరిగింది..? రాధా ఎలా చనిపోయింది..? తన రాజకీయ ఎదుగుదల కోసం జోగేంద్ర ఏం చేశాడు..? అనేది తెరమీదనే చూడాలి.

అలజడి విశ్లేషణ:

తెలుగులో పూర్తి స్థాయి పొలిటికల్ సబ్జెక్ట్ సినిమాలు చాలా తక్కువ, చాలా సినిమాల్లో రాజకీయాలని కొన్ని కొన్ని సన్నివేశాలకు వాడుకున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎక్కువ సినిమాలు లేవు, రాజకీయాలు అంటేనే ఎత్తుకి పై ఎత్తులు వాటిలోనే బోలెడంత డ్రామా, ఆస‌క్తి ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్ తేజ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు, ఒక సాధారణ యువకుడు కొన్ని పరిస్థితుల కారణంగా మహా మహా రాజకీయ నాయకులని మించి వ్యూహాలు ప‌న్నుతూ, ఎత్తులు వేస్తూ ఎమ్మెల్యే కావ‌డం, మంత్రి కావ‌డం కాస్త నాటకీయంగా అనిపించినా ఆ సన్నివేశాలు మాత్రం ర‌క్తిక‌డ‌తాయి, ఫస్ట్ హాఫ్ లో రాజకీయాలు, ఎత్తుకు పై ఎత్తులలతో ప్రేక్షకులని థ్రిల్ చేసిన డైరెక్టర్ రెండో భాగాన్ని సెంటిమెంట్ , ఎమోషనల్ సన్నివేశాలతో నింపేసాడు.

ఫస్ట్ హాఫ్ లో ఎత్తుకి పై ఎత్తుల సన్నివేశాలతో ఫుల్ స్పీడ్ లో ఉన్న సినిమా సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్లతో కొంచెం తగ్గినట్టు అనిపించినా ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమాని తెరకెక్కించారు, కొన్ని సన్నివేశాల్లో జోగేంద్ర క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన విధానం.. మంచి డైలాగులు ప్రేక్షకుల ఆసక్తి నిలిపి ఉంచుతాయి. కాకపోతే జోగేంద్ర అంత పవర్ఫుల్ గా ఎలా మారాడు..? అనేది ప్రేక్షకులకి అర్ధం కాదు, కొన్ని కొన్ని అనవసరపు సన్నివేశాలు ప్రేక్షకులని విసిగిస్తాయి, సెంటిమెంట్, రాజకీయాలతో సూపర్బ్ గా ఉన్న సినిమా క్లైమాక్స్ కి వచ్చేసరికి కొంత తగ్గిపోతుంది, మొత్తానికి ఎత్తులకు పై ఎత్తులతో సాగే నేనే రాజు నేనే మంత్రి ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తుంది.

నటీనటుల పెరఫార్మన్స్:

రానా దగ్గుబాటి:  రానా కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు, అతడి కటౌట్.. పెర్ఫామెన్స్.. జోగేంద్ర పాత్రను ప్రత్యకంగా నిలబెట్టాయి, మరోసారి నెగిటివ్ పాత్రలో రానా అదరగొట్టాడు.

కాజల్ అగర్వాల్: కథకి చాలా కీలకమైన పాత్రలో కాజల్ బాగా నటించింది.

క్యాథెరిన్ తెస్రా : బాగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో క్యాథెరిన్ తన నటనతో మెప్పించింది,

అశుతోష్ రాణా, నవదీప్, తనికెళ్ళ భరణి, పోసాని.. తదితరులు బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

  • స్టోరీ
  • స్క్రీన్ ప్లే
  • జోగేంద్ర పాత్రా
  • డైలాగ్స్

మైనస్ పాయింట్స్ :

  • క్లైమాక్స్ సన్నివేశాలు
  • కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు.

పంచ్ లైన్ : ఈ సినిమాకి జోగేంద్ర నే హీరో జోగేంద్ర నే విలన్.

(Visited 1,864 times, 117 visits today)

Comments

comments