EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Entertainment / ఐ లవ్ యూ, బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ – శైలజ

ఐ లవ్ యూ, బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ – శైలజ

Author:

ఓ నిజ జీవిత సంఘటనను ఆధారంగా చేసుకొని ఎనర్జిటిక్ స్టార్ రామ్ హిరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో ‘నేను శైలజ’ పేరుతో ఓ క్యూట్ లవ్‌స్టోరీ విడుదలకు సిద్ధం చేస్తోన్న విషయం తెలిసిందే. తన గత చిత్రం ‘శివమ్’ అనుకున్నంత విజయాన్ని సాధించకపోవడంతో రామ్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నడు. ఈమధ్యే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రామ్ కెరీర్లో ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫస్ట్‌లుక్‌గా ‘నేను శైలజ’ ఫస్ట్‌లుక్ పేరు సంపాదించుకుంది.

ఇక ఫస్ట్‌లుక్‌తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్‌ ని విడుదల చేశారు. ఈ టీజర్‌లో రామ్ సినిమాల్లో ఉండే ఎనర్జీతో ఓ క్యూట్ లవ్‌స్టోరీ చెప్పినట్లు తెలిసిపోతుంది. ముఖ్యంగా హీరోయిన్ చివర్లో చెప్పే డైలాగ్ “ఐ లవ్ యూ, బట్ ఐ యామ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ (నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నీతో ప్రేమలో లేను)” ఆసక్తికరంగా ఉంది. సినిమా కథను కొంచెం కొంచెంగా చెప్తూనే విడుదలైన ఈ టీజర్ రామ్ ఈ సారి రొటీన్‌కు భిన్నంగా కొత్తదనం చూపినట్లు స్పష్టం అవుతోంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఓ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. రామ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది.

Comments

comments