Home / Political / RBI విడుదల చేయనున్న కొత్త 50, 20 రూపాయల నోట్లు ఇవేనా?

RBI విడుదల చేయనున్న కొత్త 50, 20 రూపాయల నోట్లు ఇవేనా?

Author:

ముందుగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి కొత్త నోట్లని తీసుకువచ్చిన కేంద్రం ఈసారి కొత్త చిన్న నోట్లను కూడా విడుదల చేయబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నయి. కొత్తగా వచ్చె చిన్న నోట్లతో పాటు పాత 20 పాత నోట్లు కూడా చెలామణిలో ఉంటాయని తెలుస్తుంది. దీని గురించి త్వరలోనే RBI నుండి ప్రకటన వస్తుందని ప్రముఖ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ సందర్భంలోనే సోషల్ మీడియాలో కొత్త 20, 50 నోట్లు డిజైన్లు షేర్ అవుతున్నాయి, వీటి గురించి నుండి ఎటువంటి సమాచారం లేకపోయిన ప్రజలు మాత్రం వీటిని షేర్ చేస్తూనే వున్నారు.

new-50-and-20-rupee-note

సోషల్ మీడియా ప్రకారం రూ.50 నోటు లైట్ మెజంటా కలర్ లో ఉంది. నోటుకు ఒకవైపు ఎర్రకోట బొమ్మ కూడా ఉంది. నోటుపై కుడివైపు పైన భారత చిహ్నం, కింద రూ.50 మరియు మధ్యలో రూపీ సింబల్ ఉన్నాయి. ఎడమ వైపు పైన రూ.50, కింద RBI సీల్ ఉన్నాయి. ఇక 20 రూపాయల నోటు గ్రీన్ కలర్ లో ఉంది. నోతుపై గేట్ వే ఆఫ్ ఇండియా బొమ్మతో పాటు మధ్యలో రూపీ సింబల్ పెద్దగా ఉంది. 50 నోటు లాగే మిగతా సింబల్స్ ఉన్నాయి. దీనిపై RBI మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు మరియు కొత్త నోట్ల డిజైన్ కూడా అఫిషియల్ గా బయటకు చెప్పలేదు కాని వీటిని షేర్ చేస్తున్న వారు మాత్రం 2000 నోటు విషయంలొ కూడా డిజైన్ ముందే వచ్చినా ఎవరూ నమ్మలేదు ఇది కూడా అంతే అని వాదిస్తునారు.

(Visited 1,469 times, 56 visits today)