తెలంగాణాలో రాబోయే కొత్త జిల్లాలు ఇవే.

Author:

తెలంగాణ రాష్ట్రాం ఏర్పాడి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోని ఇప్పుడు మూడవ సంవత్సరం లోకి అడుగుపెడుతున్న తరుణంలో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ గారు తెలంగాణలో కొత్త జిల్లాలపై దృష్టి సాధించారు. ఇప్పటికే దాదాపు పూర్తి అయిన జిల్లాల లెక్కలు మరికొద్ది రోజుల్లో అధికారికంగా తెలుపనుంది తెలంగాణ గర్నమెంట్. ఇప్పటివరకు 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు 23జిల్లాలు గల రాష్టంగా మారబోతుంది. 30 జిల్లాలతో మరో ప్రతిపాదన తయారవుతోందన్న ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైన కొత్త జిల్లాలకు సంబంధించిన పని పూర్తి అయ్యిందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఉన్న 459 మండలాలతో పాటు కొత్తగా మరో 77 మందలాలు ఏర్పడనున్నాయి. మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.

23-Telangana-Districts-Details

ఒక్కసారి కొత్తగా ఏర్పడే జిల్లాలతో పాటు పాతవి కలుపుకొని మొత్తం 23 జిల్లాల జిల్లాల జనాభా – వైశాల్యం – మండలాల వివరాలు మీ కోసం.

ఆచార్య జయశంకర్ జిల్లా(భూపాలపల్లి) – 856453 మంది జనాభా ఉండగా – వైశాల్యం 6760 చ.కి.మీటర్లు – 21 మండలాలు – 3 రెవెన్యూ డివిజన్లు.

ఆదిలాబాద్ – 1422034 మంది జనాభా ఉండగా – 7673 చ.కిమీ  వైశాల్యం  27 మండలాలు – 4 రెవెన్యూ డివిజన్లు.

భద్రాద్రి(కొత్తగూడెం) -1193807 మంది జనాభా – 8297 చ.కి.మీ వైశాల్యం – 23 మండలాలు.

యాదాద్రి(భువనగిరి) – 719131 మంది జనాభా – 2956 చ.కి.మీ వైశాల్యం – 17 మండలాలు.

హైదరాబాద్ -3901928 మంది జనాభా – 1914 చ.కి.మీ వైశాల్యం – 20 మండలాలు.

జగిత్యాల – 1043000 మంది జనాభా – 3087 చ.కి.మీ వైశాల్యం – 18 మండలాలు.

కామారెడ్డి – 1068773 మంది జనాభా – 4025 చ.కి.మీ వైశాల్యం – 21 మండలాలు.

కరీంనగర్ – 1802038 మంది జనాభా – 4308 చ.కి.మీ వైశాల్యం – 26 మండలాలు.

ఖమ్మం – 1880137 జనాభా – 4360 చ.కి.మీ వైశాల్యం – 22 మండలాలు.

కొమరంభీమ్(మంచిర్యాల) -1319205 మంది జనాభా – 8442 చ .కి.మీ వైశాల్యం – 27 మండలాలు.

మహబూబాబాద్- 804136 మంది జనాభా – 3633 చ.కి.మీ వైశాల్యం – 15 మండలాలు.

మహబూబ్ నగర్– 1867620 మంది జనాభా – 6518 చ.కి.మీ వైశాల్యం – 31 మండలాలు.

మెదక్ – 1444955 మంది జనాభా – 4215 చ.కి.మీ వైశాల్యం – 25 మండలాలు.

నాగర్ కర్నూలు – 1048425 మంది జనాభా – 7447 చ.కి.మీ వైశాల్యం – 22 మండలాలు.

నల్గొండ – 1555992 మంది జనాభా – 7475 చ.కి.మీ వైశాల్యం – 32 మండలాలు.

నిజామాబాద్ – 1447961 మంది జనాభా – 3772 చ.కి.మీ వైశాల్యం – 25 మండలాలు.

రంగారెడ్డి – 1086522 మంది జనాభా – 4157 చ.కి.మీ వైశాల్యం – 20 మండలాలు.

సంగారెడ్డి – 1186280 మంది జనాభా – 3116 చ.కి.మీ వైశాల్యం – 18 మండలాలు.

సికింద్రాబాద్ – 4251614 మంది జనాభా – 1608 చ.కి.మీ వైశాల్యం – 23 మండలాలు.

సిద్ధిపేట – 1190209 మంది జనాభా – 4398 చ.కి.మీ వైశాల్యం – 22 మండలాలు.

సూర్యాపేట – 1386883 మంది జనాభా – 4348చ.కి.మీ వైశాల్యం – 25 మండలాలు.

వనపర్తి – 1136983 మంది జనాభా – 4426 చ.కి.మీ వైశాల్యం – 22 మండలాలు.

వరంగల్ – 2236051 మంది జనాభా – 4883 చ.కి.మీ వైశాల్యం – 31 మండలాలు.

Must Read:70 ఏళ్లుగా ఏ ప్రభుత్వం చేయలేని పనిని ఒక్క నెలలో చేసిన ఇంజనీరింగ్ విద్యార్థులు.

(Visited 5,801 times, 80 visits today)