EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

మైనర్ డ్రైవర్లపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ తీసుకున్ననిర్ణయం

Author:

దేశంలో ప్రతీఏటా రోడ్డు ప్రమాదాలు బారిన పడిన వారి సంఖ్య పెరిగిపోతుంది. కొందరు మితిమీరిన వేగంతో బండిని నడిపి ప్రమాదాలు చేసేవారైతే, మరికొందరు సరైన అవగాహన లేకుండా డ్రైవ్ చేసి ప్రమాదాలు చేసేవారు ఉన్నారు. కనీస రోడ్డు సెన్స్ లేకుండా డ్రైవ్ చేయడం ఎంతటి ప్రమాదమో ! అలా చేయడం వల్ల కొన్ని వేలాది కుటుంబాలు వాళ్ళ వాళ్ళని ప్రమాదాలలో కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అలాంటి వాళ్ళను కట్టడి చెయ్యడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధ‌న‌లు తీసుకురావడం పరిపాటే..

kk

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం కొత్తగా ఒక నిబంధ‌న‌ తీసుకొచ్చింది. దానిప్రకారం కనీస వయసు లేకుండా పిల్లలు ఎవ‌రైనా వాహనం నడిపితే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకరోజు జైలు శిక్ష ! ఈ శిక్షను అమలుపరుస్తున్నదగ్గరనుండి పిల్లలు వాహనం నడపడానికి జంకుతున్నారు. గత నెల ఫిబ్ర‌వ‌రిలో ఇలా డ్రైవింగ్ చేస్తూ దొరికిన పిల్లల తల్లిదండ్రులకు ఒక రోజు జైలు శిక్షను విధించారు.

పిల్లల మీద మమకారం కొద్దీ తల్లిదండ్రులు వారికి వాహనం ఇస్తున్నారని, వారికి సరైన అవగాహన లేకుండా వాహనాన్ని నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని , అలాంటి వారిని కట్టడి చేయడానికే ఈ కొత్త నిబంధ‌న‌ను తీసుకొచ్చామని ట్రాఫిక్ కమీషనర్ తెలిపారు. ఈ నిబంధ‌న‌ సమర్ధవంతంగా పని చేస్తున్న‌ద‌ని, ఇపుడు మైనర్ డ్రైవర్ల సంఖ్య‌ బాగా తగ్గిందని  తెలియచేసారు.

తెలుగు డాట్ అలజడి డాట్ కామ్ ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌,ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

(Visited 1 times, 37 visits today)

Comments

comments