EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Latest Alajadi / పార్క్ లోకి వెళ్లాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!

పార్క్ లోకి వెళ్లాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాల్సిందే..!

Author:

నగరాలలో పచ్చదనంతో నిండి ఉన్న పార్క్ లకి ప్రశాంతత కోసం వెళ్లే వారి సంఖ్య ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి, అయితే పార్క్ లలో ఉండే ప్రశాంతతని కుర్ర జంటలు అవకాశంగా తీసుకోని రెచ్చిపోతున్నారు, పార్క్ లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ఈ క్రమంలోనే పార్క్ లో ఎంట్రీకి మ్యారేజ్ సర్టిఫికెట్ రూల్ తీసుకొచ్చారు, తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారులు. మరుధమాలియా రోడ్డులో వర్సిటీ ఆధ్వర్యంలో బొటానికల్ గార్గెన్ ఉంది. ఇందులో వేలాది మొక్కలు, పక్షులు ఉన్నాయి. ఎంతో చల్లగా ఉంటుంది. స్వచ్ఛమైన గాలి కోసం ఇక్కడికి వేలాది మంది వస్తుంటారు.

Botanic-Gardens-Tamilnadu

ఇటీవల బొటానికల్ గార్డెన్ లోకి కాలేజీ విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. పార్క్ మొత్తం ఎక్కడ చూసిన జంటలు జంటలే. దీంతో అనేక కంప్లయింట్స్ వస్తున్నాయి. కాలేజీలు ఎగ్గొట్టి.. ఈ పార్క్ లో షికార్లు చేస్తున్నారు. వీరి చేష్టల వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దీన్ని దృష్టి పెట్టుకుని వర్సిటీ అధికారులు కొత్త రూల్ తీసుకొచ్చారు. పార్క్ లోకి జంటలు రావాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలనే నిబంధన పెట్టారు. సింగిల్ గా వస్తే మాత్రం ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వాలనే కండీషన్ పెట్టారు. పార్క్ లో కుర్ర జంటలు కనిపిస్తే వారి వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. జంటలకు మ్యారేజ్ సర్టిఫికెట్, ఒంటరిగా వస్తే వ్యక్తిగత వివరాలు సమర్పించాలనే నిబంధన పెట్టిన ఏకైక పార్క్ గా కోయంబత్తూరు బొటానికల్ గార్గెన్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ నిబంధన వల్ల పార్క్ లో అసాంఘిక కార్యకలాపాలు తగ్గుతాయని.. ఫ్యామిలీస్ కు ప్రాధాన్యం పెరుగుతుందని వెల్లడించారు ప్రొఫెసర్ ఎం.కన్నన్.

Comments

comments