EDITION English తెలుగు
రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది:రైల్వేశాఖ   ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు   గవర్నర్ ప్రారంభించిన...అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు   రికార్డు స్థాయికి: పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది   ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె   గ్రీవియెన్స్ ఆఫీసర్ని నియమించిన వాట్సాప్-ఇండియా   సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు   బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి   వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!   భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

బైక్ రైడర్స్ కి ట్రిపుల్ చలాన్..! అందరు ఫైన్ కట్టాల్సిందే..!

Author:

ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారికి చలాన్ లతో పాటు పాయింట్స్ సిస్టమ్ ప్రవేశపెట్టి కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్ పోలీసులు మరో కఠిన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు, లైసెన్స్ లేకుండా, బండి పత్రాలు లేకుండా నడిపే వారికి భారీగా జరిమానా పెంచిన పోలీసులు ఈ సారి ట్రిపుల్ రైడింగ్ పై ద్రుష్టి పెట్టారు, ఇప్పటివరకు ట్రిపుల్ రైడింగ్ చేస్తూ పోలీసులకు దొరికితే కేవలం డ్రైవింగ్ చేసే వ్యక్తికి మాత్రమే వెయ్యి రూపాయల ఫైన్ వేసేవారు, ఇకనుండి మూడు వేల రూపాయల ఫైన్ వేయనున్నారు. బండి నడిపే వ్యక్తికి వెయ్యి కట్టాల్సి ఉంటే.. వెనక కూర్చున్న ఇద్దరూ కూడా తలో వెయ్యి రూపాయలు జరిమానా కింద కట్టాలి. హైదరాబాద్ బైక్ రైడర్స్ కు షాకింగ్ లాంటి ఈ డెసిషన్ ను అమలు చేయబోతున్నారు ట్రాఫిక్ పోలీసులు.

Triple-Riding-Challan-Hyderabad ట్రిపుల్ రైడింగ్ చలాన్

ముఖ్యంగా కాలేజీలకి వెళ్లే యువత ఎక్కువగా ట్రిపుల్ రైడింగ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు, రూ.200 ఉన్న జరిమానాని రూ.1000 కి పెంచిన కూడా ట్రిపుల్ రైడింగ్ చేసే విషయంలో ఎలాంటి మార్పు రాలేదు, కేవలం రాచకొండ కమిషనరేట్ పరిధిలోనే గత ఐదు నెలల్లో 10వేల ట్రిపుల్ రైడింగ్ కేసులు నమోదు అయ్యాయి. 10 లక్షల రూపాయల ఫైన్ విధించారు. కేసులు నమోదు చేసి.. కుర్రోళ్ల తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇస్తున్నారు. యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అయినా రోజు రోజుకి కేసులు పెరగటంతో ట్రిపుల్ రైడింగ్ లో ఉండే మిగతా ఇద్దరికీ ఫైన్ వేసే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ట్రాఫిక్ డిపార్ట్ మెంట్.

ట్రిపుల్ రైడింగ్ చట్టాన్ని కఠినతరం చేస్తూ.. ఈ నిబంధనలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అమలు చేసే విధంగా నివేదికను తయారు చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తితోపాటు వెనక కూర్చున్న మిగతా ఇద్దరికీ కూడా చెరో వెయ్యి రూపాయల జరిమానా విధిస్తే.. మార్పు వస్తుందని భావిస్తున్నాం అంటున్నారు రాచకొండ అధికారులు. నివేదిక తుదిరూపు తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు మాత్రమే అమలు చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు ఇప్పటి రూల్సే అమల్లో ఉంటాయన్నారు.

(Visited 172 times, 51 visits today)