Home / Entertainment / యుట్యూబ్ లో సెన్సేషన్ క్రీయేట్ చేస్తున్న మెగా హీరోయిన్.

యుట్యూబ్ లో సెన్సేషన్ క్రీయేట్ చేస్తున్న మెగా హీరోయిన్.

Author:

నిహారిక..ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకూ చాలా మంది హీరోలు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కానీ మొదటిసారిగా మెగా ఫ్యామిలీ నుంచి ఓ హీరోయిన్ వెండి తెరకు పరిచయం కానుంది. తనే నాగబాబు తనయురాలు నిహారిక అనే విషయం మనకు తెలిసిందే. వెండి తెర పైకి రాకముందే నిహారిక యంకర్ గా బుల్లి తెరపై ఢీ జూనియర్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. బుల్లితెరతో పాటు ఇప్పుడు యు ట్యూబ్ లో కూడా ఈ భామ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొద్ది రోజుల క్రితం ముద్దపప్పు అవకాయ్ అనే ఒక షార్ ఫిల్మ్ ట్రైలర్ ని రిలేజే చేసింది. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ఆ షార్ట్ ఫిల్మ్ ని యు ట్యూబ్ సీరీస్ లా వారానికి ఒకటి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందులో ముందుగా మొదటి ఎపిసోడ్ ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో నిహారిక నటనకి, డైలాగ్ మాడ్యులేషన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే రెండు రోజుల్లో ఈ వీడియోకి మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అందరూ నిహారికకి తెగ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘ముద్దపప్పు అవకాయ్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంలో ఉన్నాను. మీరు పంపిన ప్రతి కామెంట్ చదివాను. థాంక్స్ ఫర్ సంక్రాంతి ట్రీట్’ అని నిహారిక తన ఆనందాన్ని పంచుకుంది.

(Visited 475 times, 16 visits today)