Home / Latest Alajadi / కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసినంత మాత్రాన జట్టులో స్థానం సుస్థిరం కాదు: కోహ్లీ

కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ చేసినంత మాత్రాన జట్టులో స్థానం సుస్థిరం కాదు: కోహ్లీ

Author:

ఇటీవలే ఇంగ్లాండ్ తో చెన్నైలో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసి అందరిని ఆకట్టుకున్న కరుణ్ నాయర్ కు చుక్కెదురైంది. 9వ తేదీన గురువారం హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో, బంగ్లాదేశ్ తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ లో కరుణ నాయకు చోటు లభించలేదు. అతనికి చోటు లేకపోవటానికి కారణం గాయం బెడద నుండి అజింక్య రహానే కోలుకోవడమే అని తెలుస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ లో పాల్గొన్న టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ ఇలా మాట్లాడారు..

no place for karun nair with bangladesh test match

యువ క్రికెటర్ కరుణ నాయర్ తో పోలిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్ అజింక్య రహానే అటు బాటింగ్ లో, ఫీల్డింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. నాయర్ ఒక్క మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ చేసినంత మాత్రాన, రెండేళ్లుగా జట్టుకు ఆపార సేవలందించిన రహానేపై వేటు వేయటం సరికాదని, టెస్టుల్లో రహానే సగటు దాదాపు 50గా ఉందని చెప్పారు. జట్టులో ప్రతి ఒక్కరు ప్రతిభావంతులే ఉన్నారని, ప్రతి ఆటగాడు ఫిట్ నెస్ కోసం ప్రత్యేకంగా వ్యాయామాలు చేస్తున్నారని కోహ్లీ తెలిపారు. రంజీ ట్రోఫీలో బాగా రాణించిన కుల్దీప్ యాదవ్ బౌయింగ్ యాక్షన్ అతనికి అదనపు బలమని, అతను ఈ మ్యాచ్ లో రాణిస్తాడని ఆశిస్తున్నాని తెలిపారు. అలాగే, మేము ఆడబోయే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్ మాకు కీలకమే అని, బంగ్లాదేశ్ ను తేలికగా తీసుకోవటం లేదని చెప్పుకొచ్చారు.

Comments

comments