EDITION English తెలుగు
పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు చేశారు.   జల్లికట్టు, కోడిపందాల పై నిషేదం సమంజసమేనా?   'హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య' సినిమా చూసేందుకు ఈరోజు పోలీసులకు సెలవు   ప్రేమికుడిపై యాసిడ్, కత్తితో దాడి చేసిన అమ్మాయి.   గత 34 సంవత్సరాల నుండి రైల్వే స్టేషన్స్ లలో మనకి వినిపించే గొంతు ఈమెదే...!   ఆ ఊరిలో చలికాలం ఉష్ణోగ్ర‌త -71 డిగ్రీలు ఉంటుంది.   ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాలా..? మాకు ఫోన్ చేయండి..! మా సేవలన్నీ ఉచితమే..!   సాంకేతికతను దొంగిలించిన కేసులో కోర్ట్ కి హాజరుకానున్న జుకర్ బర్గ్.   గర్భిణీ మహిళలకు రూ.15 వేలు, బేబీ కిట్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం.   ఎండు ద్రాక్షల డ్రింక్ ను ఇలా త్రాగితే లివర్ క్లీన్.. ఇది అద్భుతంగా పని చేస్తుంది
Home / Latest Alajadi / మొబైల్ రంగాన్ని మరోసారి శాసించబోతున్న నోకియా?

మొబైల్ రంగాన్ని మరోసారి శాసించబోతున్న నోకియా?

Author:

మొబైల్ వినియోగదారులకు పరిచయం అవసరం లేని బ్రాండ్ నోకియా. బడా బాబుల నుండి పేదవారి వరకు అన్ని రకాల ప్రజలకు తగ్గట్టు సేవలు అందించింది ఈ సంస్థ. కొన్నేళ్లుగా మైబైల్ రంగాన్ని శాసించిన నోకియా మొబైల్ ఫోన్స్ కొంతకాలంగా మార్కెట్లోకి విడుదల కాకపోవటం అందరికి తెలిసిన విషయమే. కొంత విరామం తీసుకున్న నోకియా స్మార్ట్‌ఫోన్ల మార్కెట్లోకి మళ్లీ ప్రవేశించింది. ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో కూడిన నోకియా 6 మొబైల్‌ను చైనా మా ర్కెట్లోకి విడుదల చేసినట్టు నోకియా బ్రాండ్‌ హక్కులు కలిగిన ఫిన్లాండ్‌ కంపెనీ హెచ్‌ఎండి గ్లోబల్‌ ఆదివారంనాడు ప్రకటించింది. దీని ధర 1,699 యువాన్లు (సుమారు రూ.16,000). చైనా ఇ-కామర్స్‌ పోర్టల్‌ జెడిడాట్‌కామ్‌ ద్వారా అమ్మకాలను మొదలుపెడుతున్నట్టు తెలిపింది. త్వరలోనే అన్ని మార్కెట్లలోనూ ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపింది.

nokia-6-mobile

ఈ నోకియా 6లో ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లే, 2.5డి క్వాడ్ గ్లాస్‌, డ్యూయల్‌ సిమ్‌, 4జిబి రామ్‌, 64 జిబి ఇంటర్నల్‌ మెమరీ, 16 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 8 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఏడాదిలో నోకియా బ్రాండ్‌తో ఆరు నుంచి 7 ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయాలని హెచ్‌ఎండి గ్లోబల్‌ యోచిస్తోంది. ప్రస్తుత మార్కెట్లో ఇంత తక్కువ ధరలో ఇన్ని ఫీచర్స్ కలిగిన మొబైల్ లేదు. అలాంటిది, అతి పెద్ద బ్రాండ్ ఐన నోకియా ఇంత తక్కువగా వస్తుండటం గమనార్హం. ఈ మొబైల్ గనుక మన దేశ మార్కెట్లో విడుదలైతే నోకియా మొబైల్స్ హాట్ కేకుల్లా అమ్ముడు పోవడం తధ్యం.

Comments

comments