ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు.

Author:

కొన్ని సంవత్సరాల క్రితం వరకు సోషల్ మీడియా అంటే కేవలం అదొక టైమ్ పాస్ వ్యవహారం లాగ ఉండేది, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ సోషల్ మీడియా కూడా మన జీవితంలో భాగం అయిపోయింది, న్యూస్ తెలుసుకోవాలన్న, సినిమాల గురుంచి, జాబ్స్ గురుంచి, కాలేజీల గురుంచి.. టెక్నాలజీల గురుంచి, సెలెబ్రెటీల గురుంచి.. ప్రతి ఒక్కటి సోషల్ మీడియాలో తెలుసుకోవచ్చు, ఇప్పుడు మరొక సౌకర్యం సోషల్ మీడియా ద్వారా మనం పొందవచ్చు. అదేంటంటే ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సౌకర్యం కల్పించింది. ఇది వినియోగదారులకు బాగా ఉపయోగపడుతుందని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అభిప్రాయపడింది.

ఇండేన్ గ్యాస్

ఫేస్‌బుక్ ద్వారా గ్యాస్‌ను బుక్ చేసుకునే వారు మొదటగా వాళ్ళ ఫేస్‌బుక్‌ అకౌంట్ లోకి లాగిన్ అవ్వాలి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అఫిషియల్ పేజీ Indian Oil Corporation Ltd ఓపెన్ చేసి ద్వారా బుక్ చేసుకోవాలి. ఈ పేజీలోకి వెళ్లిన తర్వాత అక్కడ బుక్ నౌ ఆప్షన్ ని క్లిక్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవాలి. ట్విట్టర్ ద్వారా చేసుకోవాలనుకునే వారు.. మొదట తమ ట్విట్టర్ అకౌంట్ కి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత Indan Refill ద్వారా బుక్ చేసుకోవచ్చు.

(Visited 31 times, 44 visits today)