EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   హైదరాబాద్ లో రోబో కిచెన్   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది, మూడు ఫొటోలు దిగి పారిపోయా: ఎన్టీఆర్‌

Author:

వివిధ బ్రాండ్ల మొబైల్ ఫోన్ లని మొబైల్ రిటైల్ షోరూం బిజినెస్ లోకి కొత్తగా వచ్చిన Celekt కంపెనీకి ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు, ఆ కంపెనీ లోగోని లాంచ్ చేయడానికి వచ్చిన ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ మొబైల్ ఫోన్ లతో తనకి ఉన్న అనుబంధాన్ని తెలియజేసారు, విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ‘మీకు ఇష్టమైన యాప్‌ ఏది?’ అని ప్రశ్నించగా.. ‘నేను గేమ్స్‌ బాగా ఆడుతుంటాను. నచ్చిన గేమ్స్‌ అన్ని డౌన్‌లోడ్‌ చేస్తుంటాను’ అన్నారు. ‘ఫొటోలు ఎక్కువగా దిగుతుంటారా?’ అని అడగ్గా.. ‘‘నేను ఫొటోలే దిగను. ఇవాళ ఉదయం నుంచి ఫొటోషూట్‌ జరిగింది. పోజు ఇవ్వాలంటే వణుకు వచ్చేస్తోంది. నేను ఒక్క చోట కుదురుగా కూర్చోలేను. నా భార్య కూడా నా ఫొటోలు తీయాలి అంటుంది. కానీ, నాకు పోజులు ఇవ్వడమే రాదు. తనకేమో ఫొటోలు తీసి ఆల్బమ్‌లో పెట్టాలని ఉంటుంది. ఇటీవలే మెటర్నటీ ఫొటోషూట్‌ జరిగింది. బలవంతంగా మూడు ఫొటోలు దిగి పారిపోయా. నాకు పోజు ఇవ్వడం నచ్చదు’ అని తారక్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్ అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో కొన్నానని

ఎన్టీఆర్ తన తొలి మొబైల్.. హైదరాబాద్ అబిడ్స్ లోని జగదీష్ మార్కెట్లో సెకండ్‌ హ్యాండ్‌ ఆల్కాటెల్‌ కొన్నానని.. అప్పుడు అందులో చాలా గేమ్స్ ఆడానని చెప్పాడు. తనకు మొబైల్ పిచ్చి ఉందని.. ఒక మూడు నెలల పాటు గాడ్జెట్లకు దూరంగా ఉండాలనే ఆలోచన చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పాడు. తనతో పోలిస్తే తన కొడుకు మొబైల్ వాడకంలో యాక్టివ్ అని ఎన్టీఆర్ చెప్పాడు. మరోవైపు ‘బిగ్ బాస్’ రెండో సీజన్లో హోస్ట్ గా నాని పెర్ఫామెన్స్ గురించి కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. నాని మంచి నటుడని.. ‘బిగ్ బాస్’లో కూడా అతను బాగా చేస్తున్నాడని అన్నాడు. ప్రతివారం నాని చెబుతున్న కాకమ్మ కథలు బాగున్నాయని ఎన్టీఆర్ అన్నాడు. ‘బిగ్ బాస్’ అనేది తిరుగులేని ప్లాట్ ఫామ్ అని.. ఎవరు చేసినా అది బాగానే ఉంటుందని తారక్ చెప్పాడు.

 

(Visited 1 times, 196 visits today)