Home / Entertainment / నాగార్జున కోసం బెంగళూర్ కి వెళ్లిన ఎన్టీఆర్..!

నాగార్జున కోసం బెంగళూర్ కి వెళ్లిన ఎన్టీఆర్..!

Author:

సినిమాలతో ఎంత బిజీగా ఉన్న అభిమానులకి ఖచ్చితంగా సమయం కేటాయించే హీరోలలో ఎన్టీఆర్ ముందుంటాడు, జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ కి వచ్చిన అభిమానులందరికి సమయం వెచ్చించి, మాట్లాడి ఫోటోలు కూడా దిగాడు, తన అభిమానులంటే ఆయనకి అంతిష్టం. కష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే చాలు.. సాధ్యమైనంతవరకు వాళ్లను ఆదుకోవడానికే ప్రయత్నిస్తుంటాడు.

NTR-Meets-His-Fan-Cancer-Patient-Nagarjuna

ఇప్పుడు ఎన్టీఆర్ ఒక అభిమాని కోసం జనతా గ్యారేజ్ షూటింగ్ ని వదిలిపెట్టి బెంగుళూరుకి వెళ్ళాడు. ఎన్నో రోజుల నుండి క్యాన్సర్ తో పోరాడుతున్న నాగార్జున అనే వ్యక్తి ఎన్టీఆర్ కి వీరాభిమాని, అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. మంచానికే పరిమితమయ్యాడు. అతను ఎన్టీఆర్ అభిమాని. తన ఫేవరెట్ హీరోను ఒకసారి చూడాలన్న కోరికను తన కుటుంబ సభ్యులతో వ్యక్తపరిచాడు, “మేక్ ఏ విష్” ఫౌండేషన్ వారి సహకారంతో ఈ విషయం ఎన్టీఆర్ దృష్టికి వెళ్ళింది, విషయం తెలిసిన వెంటనే ఎన్టీఆర్ బెంగళూరుకి వెళ్లి క్యాన్సర్ తో పోరాడుతున్న తన అభిమాని నాగార్జునని కలిసాడు, అతని చాలాసేపు మాట్లాడి ఫోటోలు కూడా దిగాడు, చాలా రోజుల తరువాత తన కొడుకు మొహంలో నవ్వుని చూస్తున్నాం అని నాగార్జున తల్లిదండ్రులు ఎన్టీఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ మధ్య మన హీరోలు అభిమానులకి చాలా విలువ ఇస్తున్నారు, చావు బతుకుల్లో ఉన్న అభిమానులని కలిసి దైర్యం చెప్తున్నారు, ఇది చాలా మంచి పరిణామం, ఇప్పటికే పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లు మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా అభిమానులని కలిశారు, మంచి పని చేస్తున్న మన హీరోలతో పాటు మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే..!

Must Read: పెళ్లి చూపులు సినిమా పర్ఫెక్ట్ రివ్యూ & రేటింగ్.

(Visited 913 times, 15 visits today)