Home / Entertainment / “నాన్నకు ప్రేమ తో” పాటల తేది?

“నాన్నకు ప్రేమ తో” పాటల తేది?

Author:

Nannaku Prematho Audio Launch Date

“నాన్నకు ప్రేమ తో” సుకుమార్‌ దర్శకత్వంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ఆడియోని డిసెంబర్ 20 న లేదా 23న గాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం. రీసెంట్ గా యుకె లో 90 రోజుల పాటు కంటిన్యూ గా షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం సంక్రాంతికు విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ,’విజయదశమి కానుకగా విడుదలైన ‘నాన్నకు ప్రేమతో..’ టీజర్‌కు ప్రపంచ వ్యాప్తంగా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. దీపావళి కానుకగా ఈ చిత్రానికి సంబంధించి పోస్టర్‌ను రిలీజ్‌ చేశాం. లండన్‌లో 60 రోజులపాటు ఓ భారీ షెడ్యూల్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతోంది. స్పెయిన్‌లో 20 రోజులపాటు చివరి షెడ్యూల్‌ను చేయబోతున్నాం. దీంతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’ అని అన్నారు.

(Visited 331 times, 57 visits today)