Home / Entertainment / ‘నాన్నకు ప్రేమతో’ పాట

‘నాన్నకు ప్రేమతో’ పాట

Author:

ntr

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఈ పేరు చేప్పితే చాలు నందమూరి అభిమానులు మారామే కాదు తెలుగు రాష్ట్రల సినిమా ప్రేమికులు కాలర్ హేగెసుకోని మారి మా హీరో అంటారు. యన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఎన్.టి.ఆర్ నటుడిగానే కాకుండా తనకున్న మక్కువతో ఇప్పటికే తన సినిమాలలో ఓ నాలుగు పాటలు పాడాడు. యమదొంగలో ‘ఓలమ్మి తిక్కరేగిందా’, కంత్రిలో ‘123 నేనొక కంత్రి’, అదుర్స్ లో ‘చారి’ మరియు రభసలో ‘రాకాసి రాకాసి’ పాటలను పాడాడు. ఈ నాలుగు సాంగ్స్ అప్పట్లో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

ఇదే కోవలోనే ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా ఓ పాటని పాడటానికి సిద్దమయ్యాడు. ఇటీవలే దేవీశ్రీ ప్రసాద్ ఎన్.టి.ఆర్ ని కలిసి ఓ పాట ఆయన పాడితే బాగుంటుందని అప్రోచ్ అయితే ఎన్.టి.ఆర్ కూడా దానికి సముఖత చూపినట్లు సమాచారం. దాంతో దేవీశ్రీ ప్రసాద్ ఫుల్ ట్యూన్ మరియు పాటని సిద్దం చేసే పనిలో ఉన్నాడు. ఆ పాట రెడీ అయ్యాక ఎన్.టి.ఆర్ ఆ పాటని పాడనున్నారు. ఎన్.టి.ఆర్ తన 25వ సినిమా ద్వారా మరోసారి సింగర్ గా కూడా అభిమానులను మెప్పించనున్నాడు. ఇది కూడా సినిమా ప్రేమికులని ఊర్రుతలు ఉగిస్తుంది అనడం లొ ఎలాంటి సందేహం లేదు.సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనుంది.

(Visited 474 times, 124 visits today)