Home / Inspiring Stories / ఒబామావి నిజమైన కన్నీళ్ళా

ఒబామావి నిజమైన కన్నీళ్ళా

Author:

obama in tears

అమెరికాలో తుపాకీ కాల్పుల వల్ల ఐదురోజుల్లోనే 499 కేసులు నమోదయ్యాయి. ఈ కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 139 వీరిలో 11 ఏళ్లలోపు చిన్నారులు 8 మంది. తుపాకీ కాల్పుల వల్ల గాయాల పాలైన వారి సంఖ్య 309 ఇవి కేవలం ఈ సంవత్సరం లో నమోదైనవే. ఈ సంవత్సరం అంటే 2015 లో కాదు 2016 అంటే వారం రోజుల్లో జరిగిన దురాగతాలే ఇవి. అమెరికా లో ఆయుధాల అమ్మకాలపై పెద్దగా ఆంక్షలేమీ లేవు. 21ఏళ్ళ లోపు పిల్లలకు మద్యం, మాదకద్రవ్యాలూ, హింసాత్మక సినిమాలూ చూపించని అమెరికా ప్రభుత్వం ఆయుధాల విషయంలో మాత్రం అంత పట్టించుకోదు. అక్కడ తుపాకీ కొనటానికి పెద్దగా కష్ట పడక్కరలేదు. ఆయుధం తమకు ఎందుకవసరమో తెలుపుతూ తమ సొంత వివరాలతో ఒక పత్రం సమర్పించాలి ఐతే ఆ పత్రంలో రాసిన అంశాలు నిజమా కాదా అని నిర్ధారించుకోవడానికి చేయాల్సిన నేపథ్య తనిఖీలూ తూతూమంత్రంగా జరిగిపోతాయి. తుపాకీ ఇట్టే చేతికొచ్చేస్తుంది. కుటుంబసభ్యులు, బంధువులు తుపాకీలను ఒకరికొకరు అమ్ముకుంటే ఆ తనిఖీ కూడా ఉండదు. వాల్‌మార్ట్‌లలో, ప్రత్యేక ప్రదర్శనల్లో, దుకాణాల్లో ఎక్కడపడితే అక్కడ తుపాకులు దొరుకుతాయి. ఇక ఇంటర్‌నెట్‌ ద్వారా జరిగే విక్రయాల సంగతి సరేసరి.

అయినా ప్రపంచం లోనే అతిపెద్ద ఆయుధ వ్యాపరుల్లో ఒకటైన అమెరికా, ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే 54 వేలకు పైగా లైసెన్స్‌డు తుపాకుల డీలర్లున్నారు. అంతేకాకుండా ఏటా 2000 నుంచి 5200 దాకా తుపాకుల ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటాయి. నిజానికి 1993లో తెచ్చిన బ్రాడీ హాండ్‌గన్‌ వయొలెన్స్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌ ప్రకారం. ఆయుధాల షాపుల్లో, ప్రదర్శనల్లో తుపాకులు కొనేవారు నేపథ్య తనిఖీల్లో పాసవ్వాలి. అంటే, వారికి మానసిక సమస్యలేమీ లేవని, డ్రగ్‌ అడిక్ట్స్‌ కాదనీ వారికి నేర చరిత్ర గానీ, ఇదివరలో ఎటువంటి మానసిక సమస్యకూ చికిత్స తీసుకోలేదనీ చెబుతూ సంబందిత పత్రాలతో ఒక రిపొర్ట్ ఇవ్వాలి. ఐతే ఈ పత్రాలలో అంశాలపై ఎటువంటి విచారణా జరగక పోవటం, తరువాత ఆయుధాన్ని కొన్నవారు ఎవరికి అమ్ముతున్నారు అనే దానిపై ఎటువంటి నియంత్రణా లేకపోవటం తో అవి ఇతరుల చేతుల్లోకి వెళ్తున్నాయి. చిన్న పిల్లలకు అందకుండా ఉంచాలనే నిబందనలు కూడా లేకపోవటం ఒక కారణం.

ఇపుడు ఈ విశయం ఎందుకు చర్చకొచ్చిందీ అంటే ఈ మధ్యనే అగ్రరాజ్య అధినేత అయిన బరాక్ ఒబామా ఒక మీటింగ్ లో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. అమెరికాలో వ్యాపించిన గన్ కల్చర్‌పై ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. గన్ కల్చర్ వల్ల వివిద కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులతో వైట్ హౌస్‌లో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో ఒబామా పాల్గొన్నారు. 2012 డిసెంబర్‌లో కనెక్టికట్‌లో ఒక ఎలిమెంటరీ స్కూల్‌లో చిన్నపిల్లలు కాల్పులకు గురైన ఘటన తలుచుకుంటే తనకు ఇప్పటికీ బాధగా ఉంటుందని చెప్పారు. ఈ మాటలు అంటున్నపుడు ఒబామా కళ్ళవెంట కన్నీళ్ళు కారాయి. వాటిని తుడుచుకుంటూ, కాంగ్రెస్(అమెరికా పార్లమెంట్) మద్దతు ఉన్నా, లేకున్నా ఈ గన్ కల్చర్‌ను నియంత్రించి తీరుతానని అన్నారు. గన్ కల్చర్ నియంత్రణకు అడ్డుపడుతున్న రిపబ్లికన్ పార్టీపై మండిపడ్డారు. నేషనల్ రైఫిల్స్ అసోసియేషన్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. అయితే తనే మళ్ళీ గన్స్ ఉన్నవారందరినుంచీ వాటిని తీసేసుకోవటం తన ఉద్దేశ్యం కాదని అన్నారు. తన స్వస్థలం షికాగోలో కూడా గన్ కల్చర్ బాగా ఉందని చెప్పారు.

నిజానికి అమెరికా దన దాహం వల్లా, ఆయుధవ్యాపారం వల్లా ఇప్పటికి జరిగే విధ్వంసం ఎంత ఉందో అందరికీ తెలుసు. నిజానికి ప్రపంచం లోనే అత్య్ధిక మారణాయుదాల వ్యాపారుల్లో అమెరికా ఒకటి. తన దేశం లోని పిల్ల మరణాలు మాత్రమే ఒబామాను కదిలించాయ లేక రాబోయే ఎన్నికల ప్రభావం తో కన్నీళ్ళొచ్చాయా అన్నదే అనుమానం.

(Visited 169 times, 6 visits today)