Home / Inspiring Stories / 863 ఏళ్ళ తరువాత వస్తున్న అరుదైన అక్టోబర్.

863 ఏళ్ళ తరువాత వస్తున్న అరుదైన అక్టోబర్.

Author:

ఈ సంవత్సరం వస్తున్న అక్టోబర్ నెలకి చాలా ప్రత్యేకత ఉంది.ఈ అక్టోబర్ చాలా అరుదైన నెల, ఈ నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలున్నాయి. ఒకే నెలలో ఎప్పుడు అమావాస్య, పౌర్ణమి చాలా అరుదుగా వస్తుంటాయి ఇలాంటి అరుదైన సంఘటన మనకు అక్టోబర్ లో కనిపించనుంది.ఇలాంటి అక్టోబర్ చాలా ఏళ్ల క్రితం కాకతీయుల రాజుల కాలంలో వచ్చింది. అలాంటి నెల ఇప్పుడు రావడం అంత్యంత అరుదు అంటున్నారు మన పండితులు.కాకతీయుల కాలం అంటే 1153 వ సంవత్సరం లో ఇలాంటి నెల వచ్చింది.  సరిగ్గా 863 సంవత్సరాల తరవాత మళ్ళీ అలాంటి నెల వచ్చింది అన్నమాట!.

october-specialty

మాములుగా అయితే ఒక నెలలో ఐదు వారాలు అనేది ఏదైనా ఒక వారం వస్తుంది కానీ ఈ నెలలో మూడు ఆది,సోమా, శని వారాలు రావడం.  ఇదే నెలలో బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి…. వంటి పండుగలు వరుసగా వస్తున్నాయి. ఇలా ఒకే నెలలో ఇన్ని పండుగలు సాధారణంగా రావు అంటున్నారు పండితులు.ఈ నెలలో వరుసాగా దసరాకు విద్యార్థులకు 15 రోజులు సెలవులు రానున్నాయి. అలాగే ఐటి ఉద్యోగులకు 12 రోజులు సెలవులు ఈ నెలలో రానున్నాయి.వరుసగా తొమ్మిది రోజు పెద్ద బతుకమ్మ అయితే మరుసటి రోజు అంటే పదవ తేదీ సెలవు, ఇక పదకొండవ తేదీన దసరా, పన్నెండవ తేదీన మొహరం అంటే పీర్ల పండగ ఉండటంతో మామూలు ఉద్యోగులకు కూడా వరుసగా 4-5 రోజులు పండగ సెలవులు రానున్నాయి.

అక్టోబర్ నెలలో ప్రత్యేకతలు:

ఆదివారాలు : 2,9,16,23,30.
సోమవారాలు : 3,10,17,24,31.
శనివారాలు : 1,8,15,22,29,

అక్టోబర్లో రానున్న పండుగలు : బతుకమ్మ తొమ్మిది రోజులు , దసరా ( 11 వ తేదీన), పీర్ల పండుగ( 12 వ తేదీన), దీపావళి( 30 వ తేదీన).అలాగే పౌర్ణమి (16 వ తేదీన) అమావాస్య (30 వ తేదీన).

Must Read: వరల్డ్ ఛాంపియన్ ని చంపేసిన ప్రభుత్వం.

(Visited 27,590 times, 129 visits today)