Home / Entertainment / ధన రాజ్ ఒక్కడితో మొదలైంది

ధన రాజ్ ఒక్కడితో మొదలైంది

Author:

okkaditho modaliandi

ఒక్కడితో మొదలైంది…! ముగ్గురు యువకులు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నారనే ఈ చిత్ర ఇతివృత్తం. ధన్ రాజ్ ముఖ్య పాత్రలో చేస్తున్న ఈ చిత్రం లో మోహన్ హీరోగా నటిస్తుండగా హీరోయిన్ గా మైనా నటిస్తున్నరు. జులైలోనే ఆడియో విడుదలైంది చిన్న సినిమాల్లో మంచి ఆడియో అనిపించుకుంది కూడా. వరంగల్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం అని చెప్తున్నారు ఈ చిత్ర దర్శకుదు మొగిలి నాగేశ్వరరావు. ముగ్గురు యువకులు తాము ఎంచుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాళ్ళు ఎంచుకున్న మార్గాన్ని ఏ విధంగా చేరుకున్నారు? అంతే కాకుండా ఒక నిస్సాయకుడైన అన్నకళ్ళముందు తన చెల్లికి దారుణం జరిగితే అతను వాళ్ళపై ఏ విధంగా కక్ష తీర్చుకున్నాడు అనే అంశంపై కథ నడుస్తుంది. కామెడీ, యాక్షన్, సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ తో అనుక్షణం ప్రేక్షకులను ఉత్తేజ పరుస్తూ ఉత్కంట కలిగిస్తూ ఉంటుంది. చివరకు ఒక మంచి మెసేజ్ తో సినిమా ముగుస్తుంది” అని చెప్పారు

ఈ సినిమాకు భాంబే బోలే సంగీతం అందించారు. తెలుగు సినీ పరిశ్రమ లోకి కొత్తగా వచ్చినప్పటికి తనకు అన్ని రంగాలనుండి మంచి సహాయసహకారాలు అందించారని ఈ సినిమా తో మంచి విజయాన్ని సాదిస్తాదని ధీమా వ్యక్తం చేశారు యూనిట్ సభ్యులు. మంచి కమేడియన్ గా ధన రాజ్ అందరికీ పరిచితుడే జబర్దస్త్ తో మంచి ఫాలోయింగ్ ఉన్న ధన్ రాజ్ ఈ సినిమాకు ప్లస్ అవనున్నారు. ఈ సినిమా నవంబర్ 20 న రిలీజ్ అవనుంది. సినిమా మంచి హిట్ కావాలని సినిమా టీమ్ కి ఆల్ ద బెస్ట్.

 

(Visited 48 times, 13 visits today)