EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

డేటింగ్‌కు అమ్మాయిలను సరఫరా చేస్తామంటూ: 20 కాల్‌సెంటర్లు..400 మంది ఉద్యోగులతో దందా

Author:

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌ డేటింగ్‌ సైట్లో పేరు నమోదు చేసుకున్నాడు. మే నెల 25న రియా అనే యువతి పేరుతో అతనికో ఫోన్‌ వచ్చింది. సభ్యత్వ స్థాయిని బట్టి హైదరాబాద్‌ నగరంలో ఉండే అమ్మాయిలను.. కోరుకున్న సమయంలో సరఫరా చేస్తామని పేర్కొంది.

సభ్యత్వం కోసం తొలుత రూ.1,080 చెల్లించాలని సూచించింది.ఈ మేరకు అతను ఆమె సూచించిన బ్యాంకు ఖాతాకు ఆన్‌లైన్‌లో నగదు జమచేశాడు. తర్వాత నుంచి వసూళ్ల పరంపర మొదలైంది. క్లబ్‌ లైసెన్స్‌ పేరిట రూ.15,600, రిజిస్ట్రేషన్‌ రుసుం కింద రూ.27,600, లైసెన్స్‌ ఫీజు రూ.37,700, సేవారుసుం రూ.50 వేలు, జీఎస్టీ కింద రూ.87,634, వ్యక్తిగత వివరాల విచారణ కోసం రూ.4.5 లక్షల చొప్పున రియా సూచించిన పలు బ్యాంకు ఖాతాల్లో జమచేస్తూ పోయాడు. చివరి విడత చెల్లింపుగా రూ.4 లక్షలు చెల్లించిన అనంతరం రియా ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ కావడంతో తాను మోసపోయినట్టు బాధితుడు గ్రహించాడు. జులె ౖ20న సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

online-dating-site-scam-busted-by-cyberabad-police-five-gang

ఈ ముఠా బయటికి మాత్రం ఆయుర్వేద, ఎరువుల సంస్థల పేరిట కార్యాలయాలను ఏర్పాటు చేసింది. వాటిలో టెలీకాలర్ల ఉద్యోగాలంటూ అమ్మాయిల్ని ఎంపిక చేసి.. పనిలో చేరిన తర్వాత అసలు బాగోతం బయటపెట్టేవారు. యువకులకు ఫోన్లు చేసి ఆకర్షించాలని సూచించే వారు. టెలీకాలర్లు వినియోగదారుల నుంచి రాబట్టే సంపాదనను బట్టి వారికి కమీషన్లు ఇచ్చేవారు. పేరొందిన అశ్లీల సైట్లలో ప్రకటనలు ఇస్తూ ఫోన్‌ నంబర్లు పొందుపరిచేవారు.

online-dating-site-scam-busted-by-cyberabad-police-five-gang

వినియోగదారులు సంప్రదించిన పక్షంలో..ఆకర్షించి బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయించుకునేవారు. అలా గత రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా రూ.కోట్లలో డబ్బు కొల్లగొట్టారు. రెండు కాల్‌ సెంటర్ల మేనేజర్లు సందీప్‌మిత్రా, నీతాశంకర్‌ను అరెస్ట్‌ చేశాం. బ్యాంకు ఖాతాలతోపాటు సంస్థ దస్త్రాలను తనిఖీ చేసి బాధితుల సంఖ్య, మోసగించిన సొమ్ము వివరాల్ని రాబట్టే పనిలో ఉన్నాం’ అని కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం వెల్లడించారు. వాటిల్లో పనిచేసే 37 మంది టెలీకాలర్లకు నోటీసులు జారీ చేశామని, పరారీలో ఉన్న సూత్రధారుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.

(Visited 1 times, 523 visits today)