Home / Political / ఈ శనివారం కేవలం వృద్ధులకు మాత్రమే పాత నోట్లు మార్పిడి చేస్తారు.

ఈ శనివారం కేవలం వృద్ధులకు మాత్రమే పాత నోట్లు మార్పిడి చేస్తారు.

Author:

పాత 500, 1000 నోట్ల రద్దుతో ఎర్పడిన కష్టాలు ఇప్పటిలోగా తీరేలలేవు. నోట్లు రద్దు చేసి పది రోజులు దాటినా కొత్త నోట్లు ఇంకా అన్ని బ్యాంకులకు చేరకపోవడంతో, బ్యాంకులు జనాల రద్ది తట్టుకోలేక చేతులెత్తేసే పరిస్తితి వచ్చింది. అత్యవసరముగా డబ్బు అవసరమున్న వారి పరిస్తితి అగమ్యగోచరముగా మారింది. ప్రజల నుండి వ్యతిరేకత వచ్చెలోపే కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చెంతాడంతా పొడుగు ఉంటున్న Q లైన్లలో నిలబడలేని వృద్ధులకు ఈ శనివారం (నవంబర్ 19) పాత నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది.

only-elderly-can-exchange-notes-on-saturday

ఈ శనివారం కేవలం వృద్ధులు (60 సంవత్సరాలు పైబడిన వారిని) మాత్రమే బ్యాంకులో పాతనోట్లు మార్చుకునే వీలుంది. మిగతా వారెవరు మళ్ళి సోమవారం దాక పాతనోట్లు మార్చుకునే వీలులేదు. బ్యాంకు లావాదేవీలు కూడా నడువవు. కేవలం బ్యాంకు సిబ్బంది తమ అంతర్గత పనులు పూర్థిచేస్తారు. మరోవైపు పాత నోట్ల మార్పిడి దుర్వినియోగమవుతోందని ప్రభుత్వం నగదు పరిమితిని రూ.2000కు తగ్గించిన విషయం తెలిసిందే

Comments

comments