EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

ఆస్కార్ బరిలో జక్కన్న చెక్కిన ఖళాఖండం

Author:

తెలుగు సినిమా చరిత్రనే తిరగ రాసిన సినిమాగా భాహుబలి నిలబడబోతోందా!?  ఔననే అంటున్నారు సినీ విశ్లేషకులు. మూడేళ్ళ శ్రమ, వందలకోట్ల బద్జెట్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగు మాత్రమే కాది భారతీయ సినిమానే ఒక ఊపు ఊపుతోంది. ప్రభాస్, దగ్గుబాటి రాణా, రమ్యకృష్ణ , అనుష్క ఇలా ఎందరో తారలతో రాజమౌళి తీసిన ఈ భారీ చిత్రం ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజై 600 గ్రాస్ మార్కెట్ తో అన్ని రికార్డులనీ అధిగమించి మొదటిస్థానం లో ఉంది. ఐతే ఇప్పుడు ఇంకో రికార్డ్ నీ తన ఖాతలో వేస్కోబోతోందీ సినిమా. దాదాపు ఇరవయ్యేళ్ళ తర్వాత ఆస్కార్ కి నామినేట్ చేయబడుతున్న రెండో సినిమాగా నిలబడబోతోంది. కే.విశ్వనాధ్ దర్శకత్వం లో కమల్ హసన్ హీరోగా వచ్చిన స్వాతి ముత్యం తర్వాత ఇప్పటి వరకూ ఒక్క తెలుగు సిమా కూడా ఆస్కార్ నామినేషన్ కి ఎంపిక కాలేకపోయింది.ఇప్పుడు రాజమౌళి మళ్ళీ ఆ రికార్డును అందుకోబోతున్నారు.

ప్రఖ్యాత ఫిలిం మేకర్ అమోల్ పాలేకర్ నేతృత్వం లో ఆస్కార్ ఎంట్రీ సెలెక్షన్ పానెల్ లో ఉన్న ఐదుగురు సభ్యులూ హైదరాబాద్ లోనే ఉన్నారు. వాళ్ళు భారతీయ సినిమా నుంచి ఆస్కార్ అకాడెమీ అవార్డ్స్ నామినేషన్ కి పంపాల్సిన సినిమాలని ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఎంట్రీ కి వచ్చిన సినిమాలని చూసి వాటిలోనుండి అత్యుత్తమ అనదగ్గ చిత్రాలను ఎంపిక చేసి ఆస్కార్ ప్యానెల్ కి పంపిస్తారు. టాలీవుడ్ నుంచి ఈసారి తెలుగు చాంబర్ ఆఫ్ కామర్స్ వారు భాహుబలి సినిమాని తెలుగు సినిమా నుంచి అఫీషియల్ ఎంట్రీ గా పంపారు.

ఆ సినిమాని చూసిన పాలేకర్ కూడా జక్కన్న చెక్కిన ఈ ఖళాఖండాన్ని చూసి ఫిదా ఐపోయాడటా. వెంటనే బాహుబలి ఆస్కార్ నామినేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఈ సంవత్సరం ఆస్కార్ బరిలో బాలీ వుడ్ నుంచి అమీర్ ఖాన్ “పీకే”,  అనురాగ్ కాశ్యప్ “అగ్లీ”, విశాల్ భరద్వాజ్ “హైదర్” ఇంకా ప్రియాంక చోప్రా నటించిన ” మేరీ కోం ” ఉన్నాయి. ఇవే కాక ” ఉమ్రికా “,” మసాన్ “,” కాకముట్టై ” లాంటి ఇతర భారతీయ భాషల చిత్రాలతో బాహుబలి పోటీ పడనున్నాడు. ఐతే ఈ పోటీని తట్టుకొని నిలబడతాడా? ఆస్కార్ వరకూ చేరుకుంటాడా అనేది చూడాలి. ఒకవేళ బాహుబలి గనక ఆస్కార్ కు వెళ్ళిందంటే ప్రపంచ సినిమా చరిత్రలో అన్ని “వుడ్” ల స్థాయి లో తెలుగు సినిమా నిలబడుతుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇవన్నీ ఏమో గానీ ఆస్కార్ కి సెలెక్ట్ ఐతే బాహుబలి-2 కలెక్షన్లు మాత్రం ఊహకందనంతగా పెరుగుతాయంటున్నాయి ట్రేడ్.

(Visited 80 times, 16 visits today)