దొంగదారుల్లో నల్లధనాన్ని మార్చుకుంటున్న బడాబాబులు..!

Author:

ఒక్క 2 వేల నోటు కోసం సామాన్య ప్రజలంతా ఏటీఎంల ముందు నాలుగైదు గంటలు లైన్లలో నిలబడుతుంటే అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన వారు మాత్రం దర్జాగా వారి నల్ల ధనాన్ని కొత్త నోట్ల లోకి మార్చేసుకుంటున్నారు, కర్ణాటక రాష్ట్రం బెంగళూర్ లో ప్రభుత్వ ప్రజా పనుల శాఖలో ఉన్నతాధికారిగా పనిచేసే జయచంద్ర అనే అధికారి ఇంట్లో ఏకంగా 4.7 కోట్ల విలువైన 2 వేలనోట్లు ఐటీ అధికారుల సోదాల్లో దొరికాయి. జయచంద్ర స్నేహితుల ఇళ్లలో, కార్యాలయాలలో సోదాలు చేసి 6 కోట్ల నగదు, 14 కిలోల బంగారం తో పాటు పలు విలువైన భూముల దస్తావేజులు స్వాధీనం చేసుకున్నారు, 6 కోట్ల నగదులో 4 .7 కోట్లు కొత్త నోట్లే ఉండటం సోదాలు చేసిన పోలీసులకే షాక్ కలిగించింది. ఇంత పెద్ద మొత్తంలో కొత్త నోట్లని ఎలా మార్చుకున్నారు అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

new-curency

దేశంలో ఉన్న నల్లధనాన్ని ఆరికట్టాలనే ఉద్దేశ్యంతోనే పెద్ద నోట్లని రద్దు చేసి కొత్త నోట్లని ప్రవేశపెట్టారు, నిజాయితీగా కష్టపడి సంపాదించిన వారు కొత్త నోట్ల కోసం బ్యాంకుల, ఏటీఎంల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతుంటే నల్ల ధనాన్ని వేనేకేసుకున్న బడా బాబులు మాత్రం చాలా సులభంగా డబ్బులు మార్చుకుంటున్నారు, 20 నుండి 40 శాతం కమిషన్ కి ఆశపడి చాలాచోట్లా బ్యాంకు సిబ్బందే సామాన్య ప్రజలకి చెందాల్సిన కొత్త నోట్లని దారి మళ్లిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితులలో ఒక్కరి దగ్గర 10 వేల రూపాయల కొత్త నోట్లు ఉండడమే చాలా కష్టం అలాంటిది దాదాపు 5 కోట్ల మేర కొత్త నోట్లని మార్చుకున్నారంటే బ్యాంకు సిబ్బంది ప్రమేయం కచ్చితంగా ఉంటుంది, ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ లలో కొత్త నోట్లు దారి మళ్లకుండా కఠిన చర్యలు తీసుకుంటే నల్లధనం వేనేకేసుకున్న వారు బయటపడే ఆవకాశం ఉంది.నల్లధనం మార్పిడికి సహకరించే వారిపై సాధారణ కేసులు కాకుండా దేశ ద్రోహం కింద కేసులు పెట్టి కఠిన శిక్ష విధిస్తేనే మిగిలిన వారు అలాంటి పని చేయాలంటే భయపడుతారు.

(Visited 1,037 times, 66 visits today)