Home / Entertainment / ఈ సారి “పడమటి సంధ్యారాగం” లండన్ లో

ఈ సారి “పడమటి సంధ్యారాగం” లండన్ లో

Author:

padamati sandhya ragam londonlo

ఒకప్పడు జంధ్యాల గారు అమెరికాలో తీసిన “పడమటి సంధ్యారాగం” సినిమా ఒక సూపర్ హిట్. విజయశాంతి ఒక సంప్రాదాయ తెలుగు అమ్మాయిగా, అమెరికా లో నటించిన విదానం అందరికి నచ్చింది. ఇప్పుడు అలాంటిదే ఒక సినిమా మన ముందుకు రాబోతుంది. ఆ సినిమా పేరు కూడా “పడమటి సంధ్యారాగం” కానీ ఈ సారి లండన్ లో తీశారు కాబట్టి ఆ సినిమా పేరు “పడమటి సంధ్యారాగం లండన్ లో” అయ్యింది. లండన్ గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు వంశీ మునిగంటి దర్శకత్వం వహిస్తున్నారు. చైతూ శాంతారాం హీరో గా మరియు షహేల హీరోహిన్ గా నటిస్తున్నారు. తెలుగు సినిమా పైన ఇంట్రెస్ట్ తోనే ఎనిమిది మాసాలు కష్టపడి, కేవలం వారాంతాలలోనే ఈ సినిమా నిర్మించడం గొప్ప విషయం. ఎక్కువ శాతం పాటల నిర్మాణానికి బయటి దేశాలకు వెళ్లే మన తెలుగు సినిమాలకి భిన్నంగా మొత్తం బ్రిటన్ లోనే నిర్మించబడిన ఈ సినిమా పాటలు డిసెంబర్ 26న హైదరాబాద్ లో విడుదల చేశారు. వి. ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు మరియు  కేశవ్ కిరణ్ సంగీతాన్ని అందించారు. ఇంకా విడుదల తేదీని ప్రకటించని ఈ సినిమా మంచి విజయం సాదించాలని కోరుకుందాం.

(Visited 126 times, 57 visits today)