Home / Entertainment / ప్యాడ్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్.

ప్యాడ్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్.

ప్యాడ్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్.

Alajadi Rating

3.5/5

[easy-social-share buttons="facebook,twitter" counters=0 total_counter_pos="left" hide_names="no" template="flat-retina" facebook_text="Share" twitter_text="Tweet"]

Cast: అక్షయ్‌కుమార్‌, రాధికా ఆప్టే, సోనమ్‌ కపూర్‌ తదితరులు.

Directed by: ఆర్‌.బాల్కీ

Produced by: ట్వింకిల్‌ ఖన్నా, అనిల్‌ నాయుడు

Banner: కొలంబియా పిక్చర్స్.

Music Composed by: అమిత్‌ త్రివేది

దేశం గర్వపడేలా ఉండే సినిమాలు చేయడంలో అక్షయ్ కుమార్ ముందుంటాడు, ఎయిర్ లిఫ్ట్, రుస్తుం.. లాంటి సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు, ఇప్పుడు మరో సందేశాత్మక సినిమాతో ప్యాడ్ మ్యాన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళనాడుకి చెందిన మురుగనాథమ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ బాల్కి తెరకెక్కించాడు, ఈ సినిమా కోసం సెలెబ్రెటీలు అందరు ప్రచారం చేసారు, మరి ఈ సినిమా ఎలా ఉందో మీరు తెలుసుకోండి.

కథ:

మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌ అనే మారుమూల గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్‌ చౌహాన్(అక్షయ్‌ కుమార్‌) కి గాయత్రి(రాధికా ఆప్టే)తో పెళ్లి అవుతుంది. ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ రుతుక్రమం కారణంగా కొన్నిసార్లు గాయత్రి బయటికి రాకుండా ఇంట్లోనే ఉంటుంది. శానిటరీ న్యాప్‌కిన్లు లేకపోవడంతో ఇంట్లోని మురికిమయమైన వస్త్రాలతో శుభ్రం చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన లక్ష్మీకాంత్‌ ఇలాంటివి వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని శానిటరీ న్యాప్‌కిన్లు వాడమని చెప్తాడు. కానీ వాటి ఖరీదు ఎక్కువని వాడలేనని అంటుంది గాయత్రి. దాంతో తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ న్యాప్‌కిన్లు తానే తయారుచేయాలన్న నిర్ణయానికి వస్తాడు లక్ష్మీకాంత్‌. లక్ష్మీకాంత్‌ నిర్ణయానికి గ్రామంలోని అందరూ అతన్ని ‘మ్యాడ్‌మ్యాన్‌’ అని వెక్కిరిస్తుంటారు. అయినా పట్టువదలని విక్రమార్క లాగా తాను చేయాలనుకుంది చేసి చూపించాలనుకుంటాడు. అలా అందరూ ఎగతాళి చేసిన ‘మ్యాడ్‌మ్యాన్‌’.. ‘ప్యాడ్‌మ్యాన్‌’గా
ఎలా మారాడు..? అందుకోసం ఏం చేసాడు..? అనేది మిగిలిన కథ.

అలజడి విశ్లేషణ:

ఈ సినిమాని తమిళనాడుకి చెందిన అరుణాచలం మురుగనాథమ్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తీశారు, ఈ శానిటరీ న్యాప్ కిన్స్, పీరియడ్స్ గురుంచి ఓపెన్ గా మాట్లాడటమే తప్పుడు విషయంగా భావిస్తారు మన దేశంలో అలాంటిది, ఈ సబ్జెక్ట్ తో సినిమా తీసి చాలా సాహసమే చేశారు సినిమా యూనిట్.

ఫస్ట్ ఆఫ్ లో అక్షయ్ కుమార్, రాధికా ఆప్టేల మధ్య పెళ్లి, ప్రేమ సన్నివేశాలతో తెరకెక్కించిన డైరెక్టర్ అసలు స్టోరీలోకి ఎంటర్ అవ్వడానికి కొంచెం టైమ్ తీసుకున్నాడు, పీరియడ్స్ వచ్చే సమయంలో ఆడవారు పడే బాధలని అర్థమయ్యేలా చూపించి ఇంటర్వెల్ కి తీసుకెళ్లాడు. సెకండ్ ఆఫ్ లో తక్కువ ధరలో శానిటరీ న్యాప్ కిన్లని తయారుచేయడానికి అక్షయ్ కుమార్ ఏం ఏం ప్రయోగాలు చేసాడు, తాను అనుకున్నది ఎలా సాధించాడో చాలా అద్భుతంగా చూపించాడు.

మారుమూల గ్రామంలో పుట్టి ఆడవాళ్ళ కోసం అత్యంత తక్కువ ధరలో శానిటరీ న్యాప్ కిన్ లని తయారుచేసిన మురగనాథమ్ జీవిత చరిత్రని తెరకెక్కించడంలో డైరెక్టర్ బాల్కి ఫుల్ సక్సెస్ అయ్యాడు, కొన్ని సన్నివేశాలు ఇబ్బంది పెట్టినట్లుగా ఉన్నప్పటికీ అక్షయ్ కుమార్ సినిమాని తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టాడు, ఆడవారికి సహజంగా వచ్చే పీరియడ్స్ గురుంచి ఓపెన్ గా మాట్లాడటంలో ఎలాంటి తప్పు లేదని, సిగ్గు పడాల్సిన అవసరం లేదనే సందేశాన్ని ఈ సినిమా చాలా బలంగా చెప్పింది.

నటీనటుల పెర్ఫార్మన్స్:

ఈ సినిమాలో ప్యాడ్ మ్యాన్ గా అక్షయ్ కుమార్ జీవించాడు, తన విలక్షణమైన నటనతో సినిమాని నిలబెట్టాడు, అక్షయ్ కుమార్ భార్యగా చేసిన రాధికా ఆప్టే కూడా చాలా బాగా నటించింది, ఇంకా సోనమ్ కపూర్ సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది, మిగిలినవారంతా బాగా నటించారు.

ప్లస్ పాయింట్స్:

  • స్టోరీ, స్క్రీన్ ప్లే
  • అక్షయ్ కుమార్ నటన
  • డైలాగ్స్
  • కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • అక్కడక్కడా బోర్ కొట్టించే సీన్స్
(Visited 136 times, 30 visits today)