Home / Videos / పండగ చేస్కోనున్న సునీల్- కృష్ణాష్టమి ట్రైలర్ వచ్చింది.

పండగ చేస్కోనున్న సునీల్- కృష్ణాష్టమి ట్రైలర్ వచ్చింది.

తన హావభావాలతో, అద్భుతమైన డాన్స్‌లతో మాస్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ కమేడియన్ గానే కాదు హీరో గా కూడా మంచి మార్కులే వేయించుకున్నాడు ఈనవ్వుల నటుడు. ఇప్పుడు ‘కృష్ణాష్టమి’ పేరుతో ఒక సరికొత్త ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనే సంగతి తెలిసిందే. కాగా కృష్ణాష్టమి సందర్భంగా “కృష్ణాష్టమి” ట్రైలర్ సెప్టెంబెర్ 5 న రిలీజ్ అయింది. “ఎదుటోడి మొహం లో సంతోషం చూడటం కోసం ఎంతదూరమైనా వెళ్తాను” ఒక్కమాటలోనే సినిమా పాయింట్ని చెప్పేసాడు. రఫ్ గడ్డం, సీరియస్ లుక్స్ తో “యాంగ్రీ యంగ్ మ్యాన్ లా కనిపిస్తున్నాడు సునీల్” వాసు వర్మ దర్శకత్వం లో, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణం లో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ స్వాంతంత్ర దినోత్సవం సందర్భం గా విడుదలైన విషయం తెలిసిందే. నిక్కి గల్రాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా, ప్రముఖ రచయిత కోనా వెంకట్ కథ ను సమకూర్చారు. ఈ సినిమా చక్కటి ఫామిలీ ఎంటర్టైనర్గా రానున్నట్టూ, ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం గా రూపుదిద్దుకుంటోందట కృష్ణాష్టమి .

అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫ్యామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయంటున్నారు యునిట్ సభ్యులు. అమెరికా నుండి వచ్చిన ఒక కుర్రాడు ఇండియా లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కుంటాడు అనే పాయింట్ నే చక్కని కామెడీతో కలిపి కథని తయారు చేసారట కోనా వెంకట్. అమెరికా అబ్బాయిగా సునీల్ ఎలా మెప్పిస్తాడూ ఎలా ప్రేక్షకులని అలరిస్తాడూ అనేది తెరపై చూడాల్సిందే. ట్రైలర్ ని చక్కటి లొకేషన్లలో ఉన్న షాట్స్ తొ కట్ చేసారు. సునీల్ పక్కా మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఎప్పట్లా కేవలం కామెడీ మాత్రమే కాకుండా మంచి యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని ట్రైలెర్ చూస్తే తెలుస్తోంది.

నిక్కి గల్రాని హీరోయిన్ గా చేస్తూండగా.. డింపుల్ చోపడే, బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముకేష్ రుషి, పోసాని కృష్ణ మురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి, తదితర ముఖ్య నటులు ఉన్నారు ఈ చిత్రంలో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సంగీతం దినేష్ అందిస్తున్నాడు, ఛాయగ్రహణం చోట కె. నాయుడు .

(Visited 47 times, 8 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]