Home / Inspiring Stories / వైకల్యాన్ని వెక్కిరించిన యోధుడు ఇంఫినిటీ రైడర్ ఆదిత్య మెహతా.

వైకల్యాన్ని వెక్కిరించిన యోధుడు ఇంఫినిటీ రైడర్ ఆదిత్య మెహతా.

Author:

Adithya Mehta Para Cyclist

1450 కిలోమీటర్లు దేశ రాజధాని డిల్లీ నుంచీ..దేశ ఆర్థిక రాజధాని ముంబై వరకూ సైకిల్ తొక్కుతూ ప్రయాణం చేసాడు.ఒక సైకిల్ మీద చుట్టూ 1450 కిలోమీటర్ల దూరం సవారి చేయడం అంటే ఒక సైకిల్ ఉత్సాహి కి అది ఒక కష్టతరమైన పరీక్షే.కానీ ఒక్క కాలు మాత్రమే ఉంటే అది పరీక్ష కాదు ఒక చాలెంజ్. ఆదిత్య మెహతా కొన్నేళ్ళ క్రితం పెద్ద ఆక్సిడెంట్ కి గురయ్యాడు.”ఒక కాలు కోల్పోయాడు” అనుకున్నరంతా. ఒక కాలు మిగిలింది అనుకున్నాడతను. సోమవారం అతను ఢిల్లీ నుండి ముంబై వరకు 1450 కిలోమీటర్ల ప్రయాణాన్ని ఇన్ఫినిటీ రైడ్ అని పిలుస్తూ ఇండియా గేటు నుండి తన సైక్లింగ్ మొదలుపెట్టాడు.. పూర్తి చేసాడు. ఇక అతని లక్ష్యం పూర్తి భారత దేశ యాత్ర అదీ ఒంటికాలు తో సైకిల్ తొక్కుతూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా సైకిల్ యాత్ర చేయడం కష్టమే. మరి ఒక్క కాలు లేకుండా చేయగలమా అనే ప్రశ్నకు ఆదిత్య మెహతా యే సమాధానం. ఇప్పటి వరకూ ఇన్ఫినిటీ రైడ్ ద్వారా ఐదు రికార్డులు సొంతం చేసుకున్న ఆదిత్య మరో రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు.తనలాంటి చాలెంజర్స్ కోసం స్థాపించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ కు ఫండ్స్ కోసం అతను చేస్తూన్న సాహసమే ఇన్ఫినిటీ రైడ్.

Adithya Mehta Para Cyclist

తనకు ఆక్సిడెంట్ అయినప్పుడు తన స్నేహితులూ,కుటుంబ సభ్యులూ ఇచ్చిన ప్రోత్సాహం తనకో బూస్ట్నిచ్చింది అనే ఆదిత్య. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ప్రారంభించి దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఇప్పటి దాకా సుమారు 21మంది స్పోర్ట్స్ మెన్ లకు మేము సహకారం అందించాం. ఫిజికల్లీ చాలెంజ్డ్ అయిన వారిపై జాలి చూపించడం నాకు ఇష్టం ఉండదు. ఇప్పటి వరకూ మాతో చేయికలిపిన చాలెంజర్లంతా మంచి పొజిషన్లో ఉన్నారు. చాలా మంది ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వేదికలపై తమ టాలెంట్స్ తో తమ సత్తా చాటారు. సాధారణంగా ఉండే వారికంటే శారీరకంగా ఏదో ఒక లోపం ఉన్న వారిలోనే వారిలోనే మనో ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైర్ ని గనక సరైన పద్దతిలో ఉపయోగించుకోగలిగితే ఎలాంటి టార్గెట్ అయినా చాలా సింపుల్ అయిపోతుంది. మా ఆదిత్య మెహతా ఫౌండేషన్ మోటో కూడా ఇదే. ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఇలాంటి వారికోసమే ఏర్పాటు చేసింది. వచ్చే రెండేళ్లలో స్పోర్ట్స్ అకాడమీ పెట్టాలనే లక్ష్యంతో ముందుకు దూసుకు పోతున్నాం. అంటాడు ఆదిత్య. అతను తలపెట్టిన పని పూర్తి కావటానికి మరో రెండేళ్లు పట్టొచ్చు. ఒక స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలనే తన కల.అది నిర్మించటానికి కోటి రూపాయిలు అవసరం. దాన్ని పూర్తి స్థాయి లో నడపటానికి 5 నుంచి 6 కోట్లు అవసరం అవుతుంది.ఆ డబ్బు సంపాదించటానికి ఇన్ఫినిటీ రైడ్ ఒక్కటే ఆదాయ మార్గం. దాంట్లో పాల్గొని విరాళాలు అందిస్తే ఎక్కువ మందికి సాయం చేయగలనంటారు ఆదిత్య.

Adithya Mehta Para Cyclist

ఆ మిషన్ లో భాగం గా ది ఇన్ఫినిటీ రైడ్ 2015 పేరుతో ఆగస్టులో బెంగుళూరు నుంచి బయల్దేరారు. హైదరాబాద్ వరకు తమ యాత్రను విజయవంతం గా పూర్తి చేసేసారు. హైదరాబాద్ చేరుకున్న ఆదిత్య మెహతా బృందాన్ని పలువురు సినీ హీరోయిన్లు ఘనంగా సన్మానించారు. ఆదిత్య మెహతా నేతృత్వంలో 30 మంది బీఎస్‌ఎఫ్ జవాన్లు, 30 మంది ఆదిత్య మెహతా ఫౌండేషన్ సభ్యులు కలిపి మొత్తం 60 మంది రైడర్లు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వరకు వారు దాదాపు 570 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌ను పూర్తి చేసుకుని నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇనార్బిట్ మాల్‌లోని ఫ్యూషన్ 9లో ఆదిత్య మెహతాతోపాటు 60 మంది రైడర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. “నువ్వొక యోధుడివి. నీ జీవితంలో నువ్వు పోరాడటం ఆపొద్దు” అని తన తండ్రి మాటలే తన ఇస్పిరేషన్ అంటున్నాడు ఈ చాలెంజర్.

(Visited 117 times, 14 visits today)