Home / Entertainment / త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ అభిమాని బహిరంగ లేఖ..!

త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ అభిమాని బహిరంగ లేఖ..!

Author:

కమర్షియల్ మార్కెట్ లో , క్రేజ్ లో పవన్ కళ్యాణ్ అనే హీరో ని కొట్టే హీరో తెలుగు ఇండస్ట్రీ లో ఇంకా ఎవ్వరూ పుట్టలేదు కావచ్చు .. అసంఖ్యాక అభిమానుల ని సొంతం చేసుకున్న ఈ హీరోకి ఉన్న ఒకే ఒక్క దోషం ‘ లెక్కలేని తనం’ దాని ద్వారా సంక్రమించే – స్వయంకృత అపరాధం … దాని ద్వారా వచ్చే అనేక ఇబ్బందులు . ఇండస్ట్రీ లో వచ్చిన మొదటి నుంచీ కళ్యాణ్ కి ఇది ఉందో లేదో తెలీదు కానీ అప్పట్లో కళ్యాణ్ కి ఉన్న జీల్ , సినిమా పట్ల ప్యాషన్ అయితే ప్రస్తుతం ఖచ్చితంగా కనపడ్డం లేదు..

ఖైదీ అనే సినిమా కోసం చిరంజీవి లాంటి అరవైయేళ్ళ వ్యక్తి కష్టపడిన దాంట్లో సగం, బాలయ్య రేంజ్ లో కూడా సాంగ్స్ లో ఒళ్ళు ఒంచలేకపోవడం అనేది సీనియర్ ల కంటే కళ్యాణ్ కి ఉన్న లెక్కలేని తనాన్ని ఖచ్చితంగా చూపిస్తోంది. తన తోటి హీరో మహేష్ మంచి కాంబినేషన్ లు ఎంచుకుంటూ ఉంటే , ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కష్టపడి కెరీర్ ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బిల్డ్ చేసుకుంటూ ఉంటే కళ్యాణ్ మాత్రం సినిమాల పట్ల అయిష్టం ఉన్న వ్యక్తి లాగా ప్రవర్తించడం కళ్యాణ్ అంటే ప్రాణం ఇచ్చే నాలాంటి వారికి చాలా ఇబ్బంది కరం. మా హీరో ఏదీ కేర్ చెయ్యడు అనే మాట అతని యాటిట్యూడ్ ని చూపిస్తూ ఉన్నప్పటికీ రాను రాను అది కేర్ చెయ్యకపోవడం లోంచి లెక్కలేని తనం గా సంక్రమిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ లెక్కలేని తనం కాదు అజ్ఞాత వాసి సినిమాకి ఉన్న అసలు ఇబ్బంది . ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరు అవుతారు అన్నట్టు నెమ్మది గా ఈ అంటు వ్యాధి త్రివిక్రమ్ కి అంటిందా ? ఇదే ప్రశ్న అజ్ఞాత వాసి సినిమా చూసిన ప్రతీ ఒక్కరికీ అనిపిస్తోంది. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అతని బృందం హ్యాండిల్ చేసిన విధానం వారి లెక్కలేని తనాన్ని ఖచ్చితంగా చూపిస్తోంది. అందమైన రిజల్ట్ వచ్చినప్పుడు గురూజీ అన్న మనమే తేడా వస్తే’ ఇదేంటి గురూజీ ‘ అని అనడం లో కాస్తంత కూడా తప్పు లేదు అని నా ఫీలింగ్ ..

నిజమే త్రివిక్రమ్ .. అతడు , ఖలేజా లాంటి పెక్యూలియర్ సినిమాలు తీసిన వ్యక్తే .. జల్సా – అత్తారింటికి దారేది లతో మాకు ఫుల్ మీల్స్ పెట్టిన వాడే .. అయితే ప్లాప్ సినిమా తీసినందుకు కాదు ఈ ఆక్రోశం .. ‘ లెక్కలేని తనాన్ని ‘ లెక్కలేనంత గా తెరమీద ఆవిష్కరించిన పద్ధతి గురించి. నేను నాలుగు ముక్కలు ప్రాస డైలాగులు రాసేసి , కెమెరా యాంగిల్స్ మార్చేసి , రెండు ఫైట్ లు పెట్టేసి , ఒక్క ఎమోషన్ సీన్ పెట్టేస్తే సినిమా ఆడేస్తుంది అనే దర్పం త్రివిక్రమ్ ఈ సినిమాతో ఖచ్చితంగా చూపించాడు . జల్సా , ఖలేజా , అతడు లాంటి సినిమాలు ఇంకా ఇప్పటికీ యూట్యూబ్ లో,MAA TV లో బోర్ అనుకోకుండా చూసే మాకు మీ నుంచి కావాల్సింది ఇది కాదు సార్ .. మీ ఫ్రెండ్ కళ్యాణ్ గురించి కాదు మా బెంగ, ఇండస్ట్రీ లో ఏ హీరో టచ్ చెయ్యలేని రేంజ్ లో ఉన్నాడు అతను , ఐదేళ్ళ ప్లాప్ వరస అతనికి పెద్ద మ్యాటర్ ఏ కాదు.  అంతగా సినిమాల మీద ఆసక్తి పోతే ఆపేస్తాడు ఇంకా సాహిధించేసే టార్గెట్ లు అతనికి ఏమీ మిగిలి లేవు , కానీ మీలాంటి దర్శకుడు అలాంటి స్నేహితుడు ఇచ్చే అంటు వ్యాధి ఎక్కించుకుని దయచేసి మీ స్థాయి ని తగ్గించుకోవద్దు ..

పవన్ కళ్యాణ్ కి ప్లాప్ ఇచ్చారు అని మా బాధ కాదు .. మీలో జ్యూస్ అయిపొయింది అనే మాట మేం ఒప్పుకునే ఛాన్స్ లేదు .. కేవలం ఆ TAKE IT FOR GRANTED అనే అంటు రోగం వదిలేసి కళ్యాణ్ లాగా Negligence పక్కన పెట్టి తదుపరి రాబోతున్న ఎన్టీఆర్ సినిమాతో అయినా మీ ‘మార్క్’ ని మాకు ఇవ్వండి . మీరు చెప్పినట్టు ‘అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవ్వరూ గుర్తించరు .. జరిగిన తరవాత గుర్తించాల్సిన అవసరం ఉండదు ‘ , కాని దరిద్రం విషయం లో ఇది రివర్స్ సార్ .  జరుగుతున్నప్పుడు మనం గుర్తించాలి లేదంటే జరిగిపోయిన తరవాత నాలాంటి అడ్డవైన వాడూ గుర్తించి మీలాంటి గొప్ప ఫిలిం మేకర్ వైపు వేలెత్తి చూపిస్తాడు ..

 ఇట్లు,

పవన్ తో పాటు మిమ్మల్ని కూడా అభిమానించే 

 సిద్ధు మంచికంటి

Also Read: Video : ఫ్యాన్స్ కాళ్లు మొక్కిన హీరో సూర్య.

(Visited 4,343 times, 60 visits today)