Home / Inspiring Stories / రాజకీయ నాయకులందు..! పవన్ కళ్యాణ్ వేరయా..!

రాజకీయ నాయకులందు..! పవన్ కళ్యాణ్ వేరయా..!

Author:

రాజకీయ నాయకుడు అంటే ఎన్నికల సమయంలో ప్రజల కాళ్ళు మోక్కాలి, గెలిచాక వాళ్ళని తొక్కాలి…! ఇది మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం, మనకున్న నాయకులలో దాదాపు 90 % పైగా నాయకులు ప్రజలని ఎలా మోసం చెయ్యాలి, డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచనతోనే ఉంటారు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే పవన్ కళ్యాణ్ లాగ ప్రజల కష్టాల గురుంచి ఆలోచించే నాయకులు ఉంటారు.

pawan-kalyan-inspiring

జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ప్రజలు ఎదుర్కుంటున్న సామాజిక సమస్యల పైననే దృష్టి పెట్టాడు, ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలని వెలుగులోకి తేవడం, దాని పరిష్కారం కోసం ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి బాధితులకి న్యాయం జరిగేలా జనసేనాని పని చేస్తున్నాడు, రాజధాని ప్రాంతంలోని రైతుల భూ సేకరణ విషయంలో రైతుల పక్షాన నిలిచి రైతులకి మేలు జరిగేలా పని చేసాడు, ఆ తరువాత గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ విషయంలో రైతుల గోడుని ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ఆ ఫుడ్ పార్క్ వల్ల తెలుగు రాష్ట్రాలకి అన్నం పెట్టె గోదావరి నది కలుషితం అవుతుంది అని, పంటలు పండవు అని గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని మరోచోటికి తరలించాలని లేనిచో ఉద్యమం చేయాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించాడు, పవన్ కళ్యాణ్ డిమాండ్ తో ప్రభుత్వం ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని విరమించుకుంది.

ఈ రెండు సమస్యలు రాష్ట్ర విభజన తరువాత ఏర్పడ్డ సమస్యలు, కానీ శ్రీకాకుళం జిల్లా ఉద్దానం గ్రామంలో ఉన్న సమస్య ఇప్పటిది కాదు, ఎన్నో సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా… ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు, గత 20 సంవత్సరాలలో దాదాపు 20 వేల మంది అంతుచిక్కని కిడ్నీ సమస్యతో మరణించారు, ఎన్ని ప్రభుత్వాలు మారిన, ఎంత మంది నాయకులు మారిన వారి జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు, ఈ సమస్య పవన్ కళ్యాణ్ దృష్టికి రాగానే నిపుణులతో ఒక టీం ని ఏర్పాటు చేసాడు, వారు ఈ సమస్య ఉన్న గ్రామాలలో పర్యటించి బాధితులతో మాట్లాడి ఒక డాక్యుమెంటరీ తయారు చేసారు, ఆ డాక్యుమెంటరీ చూసిన పవన్ కళ్యాణ్ బాధితులతో నేరుగా మాట్లాడాలని ఆ గ్రామాలలో ఈరోజు పర్యటించాడు.


ఆ గ్రామాలలో ఇప్పుడే పుట్టిన శిశువు నుండి 70 ముసలివాళ్ళ దాకా ప్రతిఒక్కరు ప్రతిరోజూ మెడిసిన్ మింగాల్సిందే, వారికి హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ చేయించుకునేంత ఆర్థిక స్థోమత లేదు, రోజు కూలి పని చేస్తే తప్ప ఇల్లు గడవని దీన పరిస్థితి వారిది, ఎన్నిసార్లు నాయకులకి విన్నవించుకున్నా పట్టించుకోలేదు. ఈరోజు పవన్ కళ్యాణ్ వల్ల ఈ సమస్య అందరికి తెలిసింది, భాదితుల గోడు విన్న జనసేనాని పుష్కరాల కోసం వందల వందల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వం ఇక్కడ జనాలు చచ్చిపోతున్న ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు, దీన్నో ఇష్యూగా చూపని ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని పవన్ ప్రశ్నించటమే కాదు.. 48 గంటల్లో కానీ ఏపీ సర్కారు స్పందించాలంటూ అల్టిమేటం జారీ చేశారు. ఐదుగురు సభ్యులతోకూడిన ఒక నిపుణుల బృందాన్ని నియమించిన పవన్ కల్యాణ్.. ఈ అంశంపై 15 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని.. దాన్ని తీసుకొని తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు వెల్లడించారు. ఈసమస్య పరిష్కారం కోసం అవసరమైన ప్రజాప్రతినిధుల్ని తానే స్వయంగా కలుస్తానని చెప్పారు.

ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు పవన్ కళ్యాణ్ చేసిన పని గురుంచి మాట్లాడుకుంటున్నారు, ప్రజా సమస్యలపై స్పందించి వాటిని వెంటనే పరిష్కరించేలా పని చేస్తున్న పవన్ కళ్యాణ్ నైజాన్ని అందరు మెచ్చుకుంటున్నారు, మాములు రాజకీయ నాయకుల లాగ పదవుల కోసం స్వార్థంగా ఆలోచించకుండా నిస్వార్థంగా  ప్రజలకోసం పనిచేస్తున్న జనసేనాని చూసి రాజకీయ నాయకులందు..! పవన్ కళ్యాణ్ వేరయా..! అని ఫిక్స్ అయిపోయారు.

(Visited 484 times, 51 visits today)