Home / Entertainment / పవన్ నోట మరో పాట?

పవన్ నోట మరో పాట?

Author:

pawan kalyan

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’. సినిమా లో సందర్భానుసారంగా వచ్చే ఓ స్పెషల్ సాంగ్ ని దేవీశ్రీ కంపోజ్ చేసాడు. ఈ సాంగ్ ని పవన్ కళ్యాణ్ చేత పాడించాలని ఆయన్ని అప్రోచ్ అయితే, పవన్ సముఖంగానే ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ వాయిస్ మరో పాటలో కూడా వినచ్చు. పవర్ స్టార్ మొదటి సారి తమ్ముడు సినిమాలో “తాడీచెట్టెక్కలేవు” పాట పాడాడు, తర్వాత ఖుషి లో”బైబైయ్యే బంగారు రమణమ్మ”, జానీ లో “నువ్వు సారా తాగు, రావోయి మా కంట్రీకీ”,గుడుంబా శంకర్ లో “కిళ్ళీ కిళ్ళీ”, పంజా లో “పాపారాయుడు”,గబ్బర్ సింగ్ లో “పిల్లా నువ్వులేని జీవితం”,సినిమాలలో పాటలు పాడాడు. రీసెంట్ గా అత్తారింటికి దారేది సినిమాలో పాడిన కాటమ రాయుడా సాంగ్ పాడారు. ఆ సాంగ్ బాగా ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర టీం గుజరాత్ లోని రాజ్ కోట్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ తన పార్ట్ కి సంబందించిన షూటింగ్ పార్ట్ ని ఫినిష్ చేసుకొని హైదరాబాద్ వచ్చాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి దీవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దేవీశ్రీ తన ప్రతి సినిమాలోనూ ఎక్కువ భాగం హీరో చేత ఓ బిట్ సాంగ్ అన్నా పాడించడానికి ట్రై చేస్తుంటాడు. అలానే ఇప్పుడు దేవీశ్రీ పవన్ ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ తో మరోసారి పాట పాడించడానికి సిద్దమవుతున్నాడు.

(Visited 170 times, 49 visits today)