EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / Inspiring Stories / పెద్దా దేవుడండీ…!

పెద్దా దేవుడండీ…!

Author:

ఖైరతాబాద్‌ గణేశుడు అంటేనే ఆంధ్ర ప్రదేశ్ కి ఒక గర్వకారణం గా ఉండేది రాష్ట్రం నలుమూలల నుంచి అదే పనిగా ఖైరతాబాద్‌ గణేశ్‌ను చూడడానికి జనం వచ్చి వెళ్లేవారు. అయితే ఇప్పుడు సమైక్య రాష్ట్రం గా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంది తెలణ్గాణా వేరయింది, రాష్ట్రాలు రెండయ్యాయి.అన్ని విశయాల్లోనూ ఒకరంటే ఒకరికి పోటీ ఏర్పడింది ఆ పోటీ ఈసారి గణేశ్‌ ఉత్సవాల నిర్వహణ వైభవంలో కూడా తప్పేలా కనిపించడం లేదు. తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహాన్ని మించిపోయేలా అతిపెద్ద భారీ గణేశ్‌ విగ్రహాన్ని ఈ ఏడాది ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్టణంలో మరో అతిపెద్ద గణేశ్‌ విగ్రహం ఏర్పాటు కాబోతోంది. అలాగే లడ్డూ కూడా ఖైరతాబాద్‌ కంటె ఇంకా పెద్ద లడ్డూ చేయిస్తున్నారు.

ఒకసారి పోటీ వాతావరణం ఏర్పడిన తర్వాత. అన్నింటా అదే పోటీ స్ఫూర్తి ఉండడం అంటే ఇదే కాబోలు. గణేశ్‌ ఉత్సవాల నిర్వహణలో అది స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాదు ఖైరతాబాద్‌లో ని గణేష్ విగ్రహం అంటేనే దేశం లోనే అతిపెద్ద విగ్రహాల్లో ఒకటి అనే పేరుంది. ఇది 60 అడుగుల ఎత్తున భారీగా ఎంతోమంది నిపుణుల చేత తయారుచేయబడుతుంది. ఉంటుంది. అయితే ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో కూడా మారాష్ట్ర వినాయకుదు అనే భావం మొదలయింది. ఖైరతబాద్‌ను మించిపోయేలా బెజవాడ గణేశ్‌ను  ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడి ఘంటసాల సంగీత కళాశాలలో 63 అడుగుల విగ్రహం ఏర్పాటు అవుతోంది. ఖైరతాబాద్ వినాయ్కుడి కన్నా తామే పెద్దవిగ్రహాన్ని తయారు చేయాలని పట్టుదలతో ఉన్నారు విజయవాడ వాసులు. దీనికోసం ఔతున్న ఖర్చెంతో తెలుసా..? అక్షరాలా 1.2 కోట్లు. దీనికోసం 60 టన్నుల బంకమన్ను, 20 టన్నుల ఇనుము, 30 టన్నుల కర్ర, రెండు టన్నుల జనుము, 25 టన్నుల బాంబే క్లే వాడుతున్నారు. ఇదే భారీ అనుకుంటే ఈ వినాయకుడి చేతిలో ఉండబోయే లడ్డూ కూడా భారీనే. పోయిన సంవత్స్రం ఖైరతాబాద్ వినాయకుడి చేతిలో లడ్డూ 5600 కిలోల లడ్దూ రికార్డును బద్దలు కొట్టటానికి 6300 కిలోల బరువున్న లడ్డూను చేయిస్తున్నారు.

ఇక్కడ ఇంకో కొసమెరుపేంటీ అంటే ఈ ఇద్దరు గణేశ్‌ ల లడ్డూ రికార్డుల్ని బద్ధలు కొట్టేలా. విశాఖ పట్టణం లో ఏర్పాటవుతున్న గణేశుడి కోసం. 8000 కిలోల(8టన్నులు) బరువున్న లడ్డూ కూడా తయారవుతోంది.  కాకపోతే రెండు రాష్ట్రాల్లోని గణేశ్‌లకు కూడా లడ్డూ అందించే ఘనత మాత్రం తాపేశ్వరానికే దక్కుతోంది. అక్కడి సురుచి ఫుడ్స్‌ వారు ఖైరతాబాద్‌ ప్రతి ఏటా లడ్డూ చేసి ఇస్తుంటారు. అదే ఊర్లోని భక్తాంజనేయ స్వీట్స్‌ వారు ఈ విజయవాడ,  విశాఖపట్నం వినాయకులకు లడ్డూ చేస్తున్నారు. మొత్తానికి గణేశ్‌ల విషయంలో పోటీపడుతున్న రాష్ట్రాలు, అభివృద్ధి, సంక్షేమం విషయంలో కూడా పోటీపడితే ప్రజలకు మేలు జరుగుతుందనీ. విగ్రహాల కోసం అన్ని కోట్లు ఖర్చు పెట్టి, లడ్డూల కోసం అన్ని టన్నుల ఆహార పదార్థాలనీ వృధా చేయటం సరికాదంటున్నారు సామాజిక వేత్తలు.

Comments

comments