Home / Entertainment / జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమాలు…!

జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమాలు…!

Author:

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బ్లాస్టర్ సినిమాగా పెళ్లి చూపులు సినిమా నిలిచింది, ఎటువంటి కమర్షియల్ హంగులు, రొటీన్ స్టోరీ లేకుండా వచ్చి కలెక్షన్ల దుమ్ము దులిపిన చిత్రం పెళ్లిచూపులు, ఈరోజు ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులలో పెళ్లి చూపులు సినిమాకి రెండు అవార్డులు దక్కాయి, ఉత్తమ సంభాషణల చిత్రంగా జాతీయ స్థాయిలో , ఉత్తమ చిత్రంగా ప్రాంతీయ స్థాయిలో పెళ్లి చూపులు సినిమాకి అవార్డులు వచ్చాయి, మొన్న హైదరాబాద్ జరిగిన ఐఫా అవార్డులలో పెళ్లి చూపులు సినిమాకి ఎలాంటి అవార్డులు (బెస్ట్ కమెడియన్ తప్ప) అవార్డులు ఇవ్వపోవటాన్ని చాలా మంది ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా విమర్శించారు, మన తెలుగు సినిమాకి మనోళ్లు అవార్డులు ఇవ్వకపోతేనేమి జాతీయ స్థాయిలో అవార్డులని కొల్లగొట్టి తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది పెళ్లి చూపులు సినిమా.

Pelli-Choopulu-Bags-national-awards

పెళ్లి చూపులు సినిమాతో పాటు శతమానం భవతి సినిమాకి ఉత్తమ ప్రజాధారణ సినిమాగా అవార్డు దక్కింది, అలాగే జనతా గ్యారేజ్ సినిమాలో ఒక పాటకి కోరియోగ్రఫీ చేసిన రాజు సుందరం మాస్టర్ కి కూడా జాతీయ అవార్డు దక్కింది.

జాతీయ అవార్డుల వివరాలు:

ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్‌ (రుస్తుం)

ఉత్తమ తెలుగు చిత్రంపెళ్లిచూపులు

ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా

ఉత్తమ సామాజిక చిత్రం – పింక్‌

ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్‌

ఉత్తమ తమిళ చిత్రం – జోకర్‌

ఉత్తమ ప్రజాదరణ చిత్రంశతమానం  భవతి

ఉత్తమ బాలల చిత్రం – ధనక్‌

ఉత్తమ ఫైట్‌ మాస్టర్‌ – పీటర్ హెయిన్స్‌ (పులిమురుగన్‌‌)

ఉత్తమ నృత్య దర్శకుడురాజు సుందరం (జనతా గ్యారేజ్‌‌)

ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)

ఉత్తమ సంభాషణ –  తరుణ్ భాస్కర్‌ (పెళ్లిచూపులు)

ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ –  శివాయ్‌

సినీ నిర్మాణానికి అనువైన రాష్ట్రంగా యూపీ ఎంపిక

Comments

comments