Home / Latest Alajadi / సరైన ఆధారాలతో పెళ్ళి, వ్యవసాయం, వ్యాపారం కోసం ఎక్కువ డబ్బు బ్యాంకు నుండి పొందవచ్చు.

సరైన ఆధారాలతో పెళ్ళి, వ్యవసాయం, వ్యాపారం కోసం ఎక్కువ డబ్బు బ్యాంకు నుండి పొందవచ్చు.

Author:

పాత 500, 1000 నోట్లు రద్దు చేసి వారం గడిచిన సామాన్యుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ బ్యాంకు ముందు చూసినా, ఏ ATM ముందు చూసినా ఇంకా పెద్ద పెద్ద లైన్లలో జనాలు కనపడుతూనే ఉన్నారు. అత్యవసరముగా డబ్బు అవసరమున్న వారి మరియు కొద్ది రోజుల్లో పెళ్ళి చేసుకొబోతున్న వారి బాధలు వర్ణనాతీతం. దీనితో కేంద్రం కొన్ని ఉపశమన చర్యలు తీసుకుంది. ఇకనుండి త్వరలో వివాహం చేసుకోబోయే వారు పెళ్ళీ ఖర్చుల కోసం తమ బ్యాంకు అకౌంట్ నుండి 2.5 లక్షలు తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఐతే ఈ డబ్బులు తీసుకోవాలంటే కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులు మరియు ఇతర వెసులుబాట్ల గురించి క్రింద చదవండి.

money-withdrawal-for-marriages
పెళ్ళి ఖర్చుల కోసం డబ్బు అవసరం ఉన్న వారి కుటుంబ సభ్యులెవరివైనా, ఉదహరణకు పెళ్ళి కూతురి తండ్రి లేదా తల్లి పాన్ కార్డు, పెళ్ళి వివరాలు మరియు కుటుంబం తరపున ఒకటేసారి డబ్బు తీసుకుంటున్నామని వ్రాతపూర్వకముగా రాసి ఇస్తే మీ అవసరాల కోసం వారి అకౌంట్ లొ ఉన్న 2.5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. ఇదే విధముగా రైతులు కూడా వ్యవసాయ అవసరాల కోసం 25 వేల రూపాయలను ప్రతి వారం సరైన ఆధారాలు చూపించి తీసుకోవచ్చు. మార్కెట్లో వ్యాపారాలు చేస్తున్న గుర్తింపు పొందిన వ్యాపారులు తమ వ్యాపార అవసరాల కోసం తగిన ఆధారాలు చూపించి వారానికి 50 వేలు తమ అకౌంట్ నుండి తీసుకోవచ్చు. మరియు డబ్బు తీసుకునే అకౌంట్ KYC (know your customer) నిభందనలకు అనుగుణముగా ఉండాలి. ఇదే సమయంలో పాత నోట్లను మార్చుకోవడానికి ఇంతకుముందు విధించిన 4500 రూపాయల పరిమితి ని 2000 రూపాయలకు తగ్గించినట్లు కేంద్రం ప్రకటించింది ఈ కొత్త నిభందనలు నవంబర్ 18 నుండి అమలులోకి వస్తాయి.

(Visited 1,577 times, 8 visits today)