Home / health / ఈ ప్రపంచంలో గొప్ప అదృష్టవంతులు ఎవరో తెలుసా!…..

ఈ ప్రపంచంలో గొప్ప అదృష్టవంతులు ఎవరో తెలుసా!…..

Author:

ఈ ప్రపంచంలో గొప్ప అదృష్టవంతుడు ఎవరంటే ఆరోగ్యంగా ఉన్నవాడు. అవును కావాలంటే ఎవరినైనా డబ్బు ఉన్నవారిని అడిగి చూడండి వారు చెప్పే ఒకేఒక పదం నాకు డబ్బుతోపాటు జబ్బు కూడా ఉంది అని అంటారు. మరి మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే చేయవలసిందల్లా సమయానికి నిద్రపోవడమే. అదేంటి నిద్రపోతే ఆరోగ్యంగా ఉన్నట్టేనా? అని మీరు అనుకోవచ్చు కానీ కంటి నిండా నిద్రపోతే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే కంటి నిండా నిద్రపోవడం వలన మనం తీసుకునే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది, అలాగే మన శరీరం పూర్తిగా రిలాక్స్ అవుతుంది, అలాగే మెదడు కూడా చురుగా పనిచేస్తుంది.

person-with-a-good-sleep-is-lucky

మరి కంటి నిండా నిద్రపోవాలంటే మీరు చేయవల్సిన పనులు !….

  • చాలా మందికి రాత్రి పడుకునే ముందు మద్యం, సిగరెట్ తాగడం అలవాటు ఉంటుంది, కానీ ఇలా చేయడం వలన సరైన నిద్రరాదట!.
  • పగలు నిద్రపోవడం వలన రాత్రి ఎక్కువగా నిద్రపట్టదు, అందు వలన పగలు నిద్రపోకపోవడమే చాలా మేలు అంటున్నారు.
  • నిద్రపోయేందుకు అనువైన స్థలం కూడా చాలా ముఖ్యం, అలాగే మంచి గాలి ఉండే స్థలం అయితే ఇంకా చాలా మంచి ప్రయోజనం.
  • యుక్త వయస్సు ఉన్నవారు కచ్చితంగా 6-8 గంటలు నిద్ర తప్పనిసరిగా పోవాలి.
  • రాత్రి పూట త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
  • అలాగే నిద్రకు 2-3 గంటల ముందే ఆహారం తీసుకోవాలి.

పైవన్నీ పాటించి, మంచి నిద్రను పోందితే ఈ ప్రపంచంలో మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు.

(Visited 731 times, 45 visits today)