EDITION English తెలుగు
రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది:రైల్వేశాఖ   ప్రణయ్‌ విగ్రహ ఏర్పాటుపై తల్లిదండ్రుల సంఘం తీవ్ర నిరసనలు   గవర్నర్ ప్రారంభించిన...అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రో రైలు పరుగులు   రికార్డు స్థాయికి: పెట్రోల్‌ ధర తొలిసారి రూ.90 దాటింది   ఉదయం అలారం మొగిందా ? అయితె దాన్ని ఆపెసి మళ్ళీ పడుకొంటున్నరా ? అయితె ఈ మనసు మనిషి సంఝర్షణ మీ కొసమె   గ్రీవియెన్స్ ఆఫీసర్ని నియమించిన వాట్సాప్-ఇండియా   సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులను బస్సుల్లో ఎక్కించరాదని ఆర్టీసీ ఆదేశాలు   బాలాపూర్‌ గణేశుడి లడ్డూ వేలం లో రూ.16.60లక్షలు అమ్ముడయ్యాయి   వెంక‌టేష్ త‌న కూతురి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ .!   భారతదేశం ఇటీవలి కాలంలో పేదరికంపై భారీ విజయాన్నే సాధించింది: ఐరాస

పోలీసు శాఖలో 14,177 ఉద్యోగాలకి ప్రకటన..!

Author:

పోలీస్ శాఖలో భారీ రిక్రూట్ మెంట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఆర్థిక శాఖ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. మొత్తం 14వేల 177 ఖాళీలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల కానుంది. ఈ 14వేల 177 పోస్టుల వివరాలను కేటగిరీల వారీగా ప్రకటించింది ప్రభుత్వం. సివిల్, ఆర్మ్ డ్ రిజర్వ్ డ్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్ పోర్ట్, ఫింగర్ ప్రింట్ విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం భారీ స్థాయిలో కానిస్టేబుల్‌ పోస్టులను భర్తీ చేసేందుకు చేస్తోంది. ఇందులో భాగంగా 14 వేల కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి అనుమతివ్వాలంటూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. జిల్లాల పునర్విభజన సమయంలో 18 వేల కానిస్టేబుల్‌ పోస్టులు అవసరమని మంత్రి మండలి నిర్ణయం తీసుకోగా…ప్రస్తుతం ఆ పోస్టుల అనుమతి కోసమే సీఎం వద్దకు ఫైలు వెళ్లింది. 3,897 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ 2017 నవంబర్‌లోనే ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నియామక ప్రక్రియను విడతల వారీగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖ సమాయత్తమవుతోంది. వచ్చే అనుమతి ఉత్తర్వులను బట్టి రెండు దశల్లో నియామకాలు చేపట్టాలని, ట్రైనింగ్‌ సెంటర్లు కూడా ఒత్తిడి లేకుండా సమయానుకూలంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చని భావిస్తోంది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌రెడ్డి సైతం నియామకాలపై ఇటీవల క్లారిటీ ఇచ్చారు. మరోవైపు 2018ని టెక్నాలజీ ఇయర్‌గా ప్రకటించిన పోలీస్‌ శాఖ.. అదే స్థాయిలో శిక్షణ వ్యవహారాలూ ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సివిల్ ఎస్ఐ : 710, సివిల్ కానిస్టేబుల్స్ : 5,002 ఖాళీలు

ఆర్మ్ డ్ రిజర్వ్ ఎస్ఐ : 275, ఆర్మ్ డ్ రిజర్వ్ కానిస్టేబుల్ పోస్టులు : 2,283

SARCPL ఎస్ఐ : 5, కానిస్టేబుల్ : 53

తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ ఎస్ఐ : 191, కానిస్టేబుల్ పోస్టులు : 5,372

కమ్యూనికేషన్ ఎస్ఐ : 29, కానిస్టేబుల్ : 142

కానిస్టేబుల్ (PTO) : 89, ఏఎస్ఐ (FPB) : 26 ఖాళీలు

14,177 పోలీస్ ఉధ్యోగాలు

ఇవే కాకుండా శుక్రవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ, పంచాయితీ రాజ్ శాఖల్లో పలు ఖాళీల భర్తీకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. శుక్రవారం ఆమోదించిన వాటిలో ఆరోగ్య శాఖలో 1224 సివిల్ అసిస్టెంట్ సర్జన్‌, 14 డెంటల్ అసిస్టెంట్ సర్జన్, 42 సూపర్ స్పెషలిస్ట్, 183 ఆయూష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. పంచాయితీ రాజ్ శాఖలోని 151 ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో 77 జూనియర్‌ అసిస్టెంట్‌, 74 టైపిస్ట్‌ పోస్టులు ఉ న్నాయి. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీచేస్తారు.

(Visited 503 times, 539 visits today)