EDITION English తెలుగు
'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌   ఇద్దరికీ యావజ్జీవ: భర్తను స్కెచ్ వేసి చంపిన భార్య, ప్రియుడు   జొహ్యానెస్బర్గ్ లో ఘనంగా బతుకమ్మ సంబరలు ధూమ్ ధామ్   గర్ల్‌ఫ్రెండ్‌ కోసం దొంగగా మారిన గూగుల్‌ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు   ఈవీఎంలు తరలిస్తున్న భద్రతాసిబ్బందికి చెందిన ఏకే47 తుపాకి మిస్సింగ్‌   కూలీ ప‌నిచేసే మ‌హిళ‌….పేద‌ల‌కోసం ఏకంగా ఆసుప‌త్రినే నిర్మించింది.!   56శాతం భారతీయులు లంచం ఇచ్చారు..గత ఏడాదితో పోలిస్తే 11 శాతం ఎక్కువ   సీఎం రమేశ్‌పై ఐటీ దాడులు కడప, హైదరాబాద్‌లోని ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు

మూడు నెలల చిన్నారి నరబలి కేసు చేధించిన పోలీసులు.

Author:

హైదరాబాద్ లో సంచలనం రేపిన మూడు నెలల చిన్నారి నరబలి కేసుని పోలీసులు చేధించారు, తన ఇంటిపై చిన్నారి తల ఉందని పోలీసులకి సమాచారం ఇచ్చిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖరే ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. కరీంనగర్ శివారులోని ఒక తండా నుండి పాపని తీసుకొచ్చి క్షుద్రపూజలు చేసి నరబలి ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు, ఈ కేసులో పోలీసులు పూజారితో సహా ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

నరబలి క్షుద్రపూజలు

కేసు వివరాల్లోకి వెళితే ఉప్పల్ చిలుకానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజశేఖర్ క్యాబ్‌డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తన భార్య శ్రీలత ఆరోగ్యం తరుచు పాడవవుతుండటంతో డాక్టర్లని నమ్మకుండా పూజారులని నమ్మాడు. క్షుద్రపూజలు చేసే పూజారులు చెప్పిన విధంగా చంద్రగ్రహణం రోజు క్షుద్రపూజలు నిర్వహించాడు. క్షుద్రపూజలో భాగంగా అప్పటికే తాము కొనుగోలు చేసిన మూడు నెలల చిన్నారిని బలి ఇచ్చాడు. అనంతరం ఉదయం మొండాన్ని మాయం చేసిన రాజశేఖర్, పూజ అనంతరం తలను మాయం చేయడానికి వీలుకాకపోవడంతో తలను ఇంటి దాబాపై ఉంచాడు. ఆరోజు ఉదయం తన ఇంటి డాబాపై చిన్నారి తల ఉందని పోలీసులకి చెప్పాడు, మేడారం జాతరకు వెళ్ళడానికి ఇంటి పైన ఆరేసిన బట్టలు తీసుకరావడానికి వెళ్ళినప్పుడు చిన్నారి తలని చూసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చాడు.

నరబలి కేసులో ఇంటి యజమానే నిందితుడు!

సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ తో చేరుకున్న పోలీసులు రాజశేఖర్ ఎదురు ఇంట్లో ఉండే నరహరి, అతని కొడుకు రంజిత్ లని అనుమానితులుగా ఆరెస్ట్ చేసారు, వీరిని విచారించిన పోలీసులకు వారే నేరానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు లభించకపోవడంతో కేసు విషయంలో రాజశేఖర్ వ్యవహార శైలిపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు, దాంతో నిందితుడు రాజశేఖర్ తాను చేసిన ఘోరాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటికి ఆ చిన్నారి తల్లితండ్రుల వివరాలు తెలియలేదు.

(Visited 340 times, 361 visits today)