మీ వాహనంకి పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా ?

Author:

రోడ్డు మీద వెళ్తున్న వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ ఆపారనుకోండి. లైసెన్సుంది.. హెల్మెట్ ఉంది.. వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ) ఉంది.. పొల్యూషన్ ఒక్కటే లేదు సార్.. వదిలేయండి అని అడగడం చాలాసార్లు చూస్తుంటాం. పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోయినా ఏమి కాదులే అనుకుంటున్నారా? నిజానికి పొల్యూషన్ సర్టిఫికేట్ కచ్చితంగా ఉండి తీరాలి. టూ వీలర్, త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ ఏ బండైనా..కారు..లారీ ఇంకేదైనా వాహనం మన దేశంలో రోడ్డు ఎక్కాలంటే నాలుగు సర్టిఫికెట్లు కచ్చితంగా ఉండాలి. 1. డ్రైవింగ్ లైసెన్స్ 2.వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్(ఆర్సీ) 3. ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ 4. పొల్యూషన్ సర్టిఫికేట్(పీయూసీ) .. ఈ నాలుగు లేకపోతె రోడ్డు మీద వాహనాన్ని నడిపే హక్కు లేనట్టే. చాలామంది ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్ వెంట తీసుకెళతారు కానీ పొల్యూషన్ సర్టిఫికేట్ ని నిర్లక్షం చేస్తారు. అసలు ఇది అవసరమా.. లేకపోతే ఏంటి అని తిరిగి ప్రశ్నించే జనాలూ ఉన్నారు. ఈ పొల్యూషన్ సర్టిఫికేట్ ఎంతవరకు అవసరం, అసలిది ఎందుకవసరం అనే విషయాలు అలజడి ప్రత్యేకంగా అందిస్తోంది.

pollution certificate

అసలు పొల్యూషన్ సర్టిఫికేట్ (పీయూసీ) అంటే ఏంటి ?

పీయూసీ అంటే పొల్యూషన్ అండర్ కంట్రోల్ అని అర్థం. రోడ్డు మీద ఫలానా వాహనం వెళ్ళడం వల్ల, దాని నుండి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ ఎంతుంది, దాని వల్ల పర్యావరణంకి ఎంత హాని జరిగే అవకాశం ఉంది. గాలి కాలుష్యం అవుతుందా.. లేదా.. తదితర వివరాలు, లెక్కలతో సరి చూసి మనం వాహనాన్ని నడిపేందుకు ఇచ్చే అనుమతి పత్రం ఇది. మన దేశ, రాష్ట్ర రోడ్డు రవాణా విభాగం నిర్దేశించిన యూనిట్లలోపు ఉంటేనే ఈ పొల్యూషన్ సర్టిఫికేట్(పీయూసీ) ఇస్తారు. మన వాహనం వెదజల్లే పొగ ద్వారా కాలుష్యం ఏ మేరకు వస్తుంది అనేది దానిలో చాలా క్లియర్ గా ఉంటుంది. కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం 1989 ప్రకారం ప్రతి వాహనం ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే.

ఏ ఏ వాహనాలకు పీయూసీ అవసరం ?

రోడ్డు మీద నడిపే ప్రతి వాహనానికీ పీయూసీ అవసరం. కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం 1989 ప్రకారం ప్రతి వాహనం ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందే అని నిర్దేశించింది.

ఈ పీయూసీ ఎప్పుడిస్తారు ?

వాహనం కొన్న సంవత్సరం తరువాత పీయూసీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి వాహనం పీయూసీ పరీక్ష చేసి సంవత్సరం పాటూ ఎలాంటి సమస్య లేదని తేలితేనే ఆ వాహనాన్ని సదరు కంపెనీ అమ్మగలదు. దీన్ని బట్టి వాహనం కొన్న మొదటి సంవత్సరం పొల్యూషన్ సర్టిఫికెట్ అవసరం లేదు. కాబట్టి సంవత్సరం తరువాత మనం మళ్ళీ పీయూసీ తీసుకోవాలి.

పీయూసీ ఎంతకాలం చెల్లుబాటు అవుతుంది ?

ఒకసారి తీసుకున్న పీయూసీ ఆరు నెలలు చెల్లుతుంది. తర్వాత మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది.

పీయూసీ పరీక్ష ఖరీదు ఎంత?

పీయూసీ టెస్టు 60 రూపాయల నుంచి 100 వరకు ఉంటుంది. ఇది వాహనం, అది వాడే ఇంధనం.. పెట్రోల్, డీజిల్ బట్టి మారుతుంది.

పీయూసీ లో ఎలాంటి వివరాలు ఉంటాయి ?

పొల్యూషన్ సర్టిఫికేట్ సీరియల్ నంబర్, టెస్ట్ చేసిన వాహనం నంబర్ ప్లేటు, టెస్టు చేసిన తేదీతో పాటు ఎప్పటివరకు పీయూసీ చెల్లుతుందో తేదీ వివరాలు, పొల్యూషన్ రీడింగ్ వివరాలు ఈ పీయూసీ లో పొందుపరుస్తారు.

పీయూసీ ఎక్కడెక్కడ చేస్తారు ?

దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ పీయూసీ టెస్టింగ్ సదుపాయాలూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా పీయూసీ పరీక్ష కేంద్రాలూ ఉంటాయి.

వాహనం తో పాటూ పీయూసీ కచ్చితంగా తీసుకెళ్ళాలా ?

ప్రతి వాహన దారుడూ తన వాహన పత్రాలు, లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలతో పాటూ పీయూసీ కచ్చితంగా తీసుకెళ్ళాలి. రవాణా అధికారులు లేదా పోలీసులు అడిగినప్పుడు తప్పక చూపించే భాద్యత కూడా వాహనదారుడిదే.

ఏ వాహనానికి ఎంత ఉండాలని పీయూసీ చెబుతోంది ?

mobile pollution certificate

(Visited 1,438 times, 117 visits today)