రంగస్థలంలోకి పూజ హెగ్డే ఎంట్రీ.

Author:

రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమాపై ఇప్పటికే అనేక అంచనాలు ఉన్నాయి, మొన్న విడుదల అయిన టీజర్ కూడా అందరిని విపరీతంగా ఆకట్టుకుంది, ఒక్క సాంగ్ మినహా మిగతా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేసిన సుకుమార్ ఆ చివరి ఐటెం సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో రీసెంట్ గా మొదలుపెట్టాడు, ఈ ఐటమ్ సాంగ్ లో పూజ హెగ్డే చిందులు వేయడం సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుంది.

రంగస్థలంలో పూజా ఎంట్రీ

డీజే సినిమాలో బికినీతో అందరి మతులు పోగొట్టి, పాటలలో అల్లు అర్జున్ కి దీటుగా స్టెప్పులు వేసి అదరగొట్టింది, ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ కి పోటీగా డ్యాన్స్ చేయనుంది, సుకుమార్ సినిమాలలో ఐటమ్ సాంగ్స్ అదిరిపోతాయి, ఈ సినిమాలో దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే ట్యూన్ కి రామ్ చరణ్, పూజా హెగ్డే వేసే స్టెప్స్ కి థియేటర్ మోతెక్కిపోవడం ఖాయం అంటున్నారు యూనిట్ మెంబెర్స్, పూజ హెగ్డే మొదటిసారి ఐటమ్ సాంగ్ చేస్తుంది, డీజే తరువాత వరుస ఆఫర్లని పట్టేసిన పూజ.. రంగస్థలంలో ఐటమ్ సాంగ్ కి ఒప్పుకోవడం ఇప్పుడు ఫిలిం నగర్ లో టాక్ అఫ్ ది టౌన్..!

(Visited 74 times, 83 visits today)

Comments

comments