తెలుగు రాష్ట్రాల్లోని పోస్టల్ శాఖలో 1800 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల..!

Author:

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో దాదాపు 1800 గ్రామీణ పోస్టల్ సేవల్లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది పోస్టల్ శాఖ. తెలంగాణ రాష్ట్రంలో 645 ఉద్యోగాలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 1126 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ని జారీ చేసారు, ఈ ఉద్యోగాలకి 10 తరగతిని విద్యార్హతగా ప్రకటించారు, ఈ ఉద్యోగాలకి ఆన్ లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి, మార్చి 18 వ తేదీ నుండి ఏప్రిల్ 19 వ తేదీ లోపు ఆన్ లైన్ ద్వారా అప్లై చేయొచ్చు, ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.

Postal-Jobs-Telangana

మొత్తం ఉద్యోగాలు : తెలంగాణ – 645 , ఆంధ్ర ప్రదేశ్- 1126
విద్యార్హత : 10 వ తరగతి.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు తేదీలు : 18 మార్చి నుండి 19 ఏప్రిల్ వరకు.
వెబ్ సైట్ : www.appost.in

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ లో ఉన్న పూర్తి నోటిఫికేషన్ ని చూడండి.

(Visited 3,863 times, 320 visits today)

Comments

comments