EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ఊరంటే ఇది..సర్కారీ బడి కాపాడేందుకు సూపర్ ఐడియా.

Author:

ఈ రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కావాలి ..ఎందుకంటే హాయిగా గడిచిపోతుంది. జీతాలే జీతాలు..పెద్దగా పని భారం ఉండదు. పైగా ఫుల్లుగా హాలిడేస్, అనేక వైద్య,రుణ సదుపాయాలూ, అడిగేవారుండరు. రిటైర్ అయ్యాక కూడా పెన్షన్ సౌలభ్యం, కాబట్టి అందరికీ ప్రభుత్వ ఉద్యోగమే కావాలి కానీ ఎవరూ వారి పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించరు. పైగా నామూషి గా ఫీలవుతారు. లక్షలు సంపాదిస్తున్న మనం ఇలా డొక్కు సర్కారీ స్కూలకు పంపాలా ? అక్కడేం సదుపాయలున్నాయని..ఒక్క టీచర్ సరిగా రారు..క్లాసులు చెప్పారు ఇలా సవా లక్ష సమస్యల్ని నిమిషం లో ఏకరువు పెట్టేస్తారు. ప్రైవేట్ స్కూలే గొప్ప. డిజిటల్ క్లాసులు..స్మార్ట్ లుక్కు లు..ఇంగ్లీష్ భాషకు వోటేసి  సర్కారీ బడులను హేళనగా చూస్తున్నారు అంతా..

ఇలాంటి రోజుల్లో కూడా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకే పంపించండి.. లేదంటే భారీ జరిమానా తప్పదంటూ ఒక ఊరు ఊరే ఏకమై తీర్మానించింది. ప్రభుత్వ స్కూళ్లను బతికించుకోవడానికి, ఆ ఊరు చూపిన దారి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని పోతారం గ్రామం ఈ ఆదర్శ విధానానికి బీజం వేసింది. ఊరంతా ఒక్కటై ఏ ఒక్కరూ ప్రైవేట్‌ స్కూల్ కు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్‌ పాఠశాలకు పిల్లలను పంపిస్తే వారికి రూ.50 వేల జరిమానా విధించాలని కూడా తీర్మానించి  సర్పంచ్‌ సిరికొండ కవితకు తీర్మాన పత్రాలను సమర్పించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి సర్కారు బళ్ళు మూతపడే పరిస్థితి నెలకొనడం వల్లే ఈ సమష్టి నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు చెప్పారు.

ప్రభుత్వ బడి

భేష్..ఊరంటే మీది.ఊరి సమస్య ఒక్కరిదైనా..అందరిదే..కలసికట్టుగా ఊరిని,ఊరి విద్యావ్యవస్తని కాపాడుకోవాలని వీరు చేస్తోన్న కృషి అభిలషణీయం. అసలు ప్రభుత్వ ఉద్యోగులంతా ప్రభుత్వ స్కూల్లలోనే చదివించాలనే మెసేజ్ లు కూడా సోషల్ నెట్ వర్కుల్లో రోజూ చూస్తున్నాం. ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ఆపాలంటే ప్రభుత్వమే ఈ ఊరిలాంటి కటిన నిర్ణయం తీస్కుంటే బెటర్ అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

(Visited 492 times, 42 visits today)

Comments

comments