Home / Entertainment / Video: తన మాటలతో బాహుబలి టీమ్ ని నవ్వులలో ముంచెత్తిన సావిత్రి.

Video: తన మాటలతో బాహుబలి టీమ్ ని నవ్వులలో ముంచెత్తిన సావిత్రి.

Author:

బాహుబలి 2 సినిమా రిలీజ్ కి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉంది, బాహుబలి సినిమా కోసం ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..? అనే దాని కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు, సినిమా విడుదలలో భాగంగా బాహుబలి సినిమా టీమ్ ప్రచార కార్యక్రమాలలో మునిగిపోయారు, బాలీవుడ్, కోలీవుడ్ , మల్లువుడ్ లలో టీమ్ మొత్తం తిరిగి ప్రచారం చేసారు, అనేక టీవీ షో లలో బాహుబలి సినిమాలో ముఖ్య భాగమైన ప్రభాస్ , రానా , అనుష్కలు ఇంటర్వ్యూలు ఇచ్చారు.

మాములుగా టీవీ ఇంటర్వ్యూలు అంటే గంటలు గంటలు ఏవేవో పిచ్చి ప్రశ్నలు వేసి , అందరు యాంకర్ లు దాదాపు ఒకే రకమైన ప్రశ్నలు అడుగుతారు, కొన్నిసార్లు ఆ ఇంటర్వ్యూలో చాలా బోర్ కూడా కొట్టిస్తాయి, కానీ బాహుబలి సినిమా ప్రమోషన్ లలో భాగంగా V6 ఛానల్ కి ప్రభాస్ , రానా, అనుష్కలు ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది, V6 ఛానెల్ యాంకర్ సావిత్రి అడిగిన ప్రశ్నలు, భాష , మాటలకి ప్రభాస్ , రానా , అనుష్కలు పడి పడి నవ్వారు, బాహుబలి సినిమా మొదలైనప్పటి నుండి ఇంత మంచి ఇంటర్వ్యూ ఇవ్వలేదు అని ప్రభాస్ అన్నాడంటే ఆ ఇంటర్వ్యూ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఆ ఇంటర్వ్యూ పై మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Comments

comments