EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

ప్రేమమ్ రివ్యూ & రేటింగ్.

Author:

ప్రేమమ్ రివ్యూ , ప్రేమమ్ టాక్

ప్రేమమ్ సినిమా గురించి గత సంవత్సరం నుండి వింటూనే ఉన్నాం ముందుగా మలయాళంలో ఒక మాములు సినిమాగా విడుదలై బ్లాక్ బ్లాస్టర్ హిట్ గా నిలిచింది. అలాంటి సినిమాని మన తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి మన ముందుకు తీసుకువస్తున్నారు. ఒక బ్లాక్ బ్లాస్టర్ సినిమాని రీమేక్ చేయడం అంటే కత్తిమీద సాములాంటిదే ఎందుకంటే కథ, కథనం మనకు ముందుగానే తెలుసు గనుక ఇక పాత్రలే మనల్ని ఆకట్టుకోవాలి. మరి ప్రేమమ్ ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఒక్కసారి చూద్దాం….!

కథ :

విక్రమ్( నాగ చైతన్య ) స్కూల్ డేస్ లో హేమ( అనుపమ పరమేశ్వన్) ను ప్రేమిస్తుంటాడు. తనని ఇంప్రెస్ చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్న సమయంలో హేమ తనను పెళ్లి చేసుకునే అబ్బాయితో కనిపిస్తుంది. ఆ తర్వాత విక్రమ్ కాలేజ్ లో చేరుతాడు అక్కడికి గెస్ట్ లెక్చరర్ గ వచ్చిన సితార(శృతిహాసన్) ని ప్రేమిస్తాడు. కొన్ని అనుకోని సంఘటనల వలన ఆమెకు దూరం అవుతాడు. ఆ తర్వాత విక్రమ్ చదువు పూర్తీ చేసుకొని సొంత బిజినెస్. స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మడోన్నా ప్రేమలో పడతాడు… ఈ ప్రేమ కథకు కూడా కొన్ని సమస్యలు వస్తాయి అదే సమస్య కథని ఒక మలుపు తిప్పుతుంది.

ఈ సినిమాలో విక్రమ్ హేమతో విడిపోవడానికి కారణం అలాగే సితార పై అంత ప్రేమని ఎందుకు చంపుకున్నాడు చివరకు మడోన్నాను ఎందుకు ప్రేమిస్తాడు ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది మిగతా సినిమా…

అలజడి విశ్లేషణ :

ఈ సినిమా మనకు ముందే తెలుసు కాబట్టి ఏమాత్రం చిన్న పొరపాటు జరిగిన మొదటికే మోసం వస్తుంది కానీ దర్శకుడు ఈ సినిమాని చాలా భాగా ప్రెసెంటేషన్ చేసాడు అని చెప్పాలి. స్కూల్ డేస్ లవ్ లో నాగ చైతన్య, హేమ మధ్య సన్నీవేశాలు చాలా బాగా పండినవి అని చెప్పాలి. అందులో ముఖ్యంగా చైతు, హేమను గుడిలో లవ్ ప్రపోజ్ చేసే సమయంలో అనుకోకుండా జరిగే సంఘటన ఆసక్తిగా ఉంటుంది. దాని తర్వాత 2005 లోకి కథ వస్తుంది. కాలేజ్ లో చైతు గ్యాంగ్ వార్ నడుస్తుంటుంది. కాలేజీలో తన వలన చెడ్డపేరు వస్తుందని ప్రిన్సిపాల్ తన అంకుల్ విక్టరీ వెంకటేష్ ని పిలుస్తాడు. ఈ సన్నివేశం సినిమాలో చాలా బాగా చూపించాడు దర్శకుడు.తర్వత ఆ కాలేజ్ లో లెక్చరర్ గా పని చేస్తున్న శృతి ని ప్రేమిస్తుంటాడు. వీరి ప్రేమలో కొన్ని అనుకోని సంఘటనలతో ఇంటర్వెల్ వస్తుంది.

ఆ తర్వాత చైతు, శృతి మధ్య వచ్చే సన్నీ వేశాలు ,చదువు అయిపోయిన తర్వాత మడోన్నా ప్రేమలో పడటం, తనకు ఎంగేజ్ మెంట్ జరిగింది అని చెప్పడం అక్కడి నుండి క్లైమాక్స్ లోకి వెలుతుంది సినిమా. చివరగా నా జీవితంలోకి ‘ఎస్’ లెటర్ తో స్టార్ట్ అయ్యే పేరు ఉన్న అమ్మాయి నాకు భార్యగా వస్తుంది అని చెప్పడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటుల పనితీరు:

చైతన్యఈ సినిమాలో చైతు తప్ప మరి ఎవరు చేయలేరు అనుకునే విధంగా చేశాడు. స్కూల్ పిల్లాడిగా, కాలేజ్ కుర్రాడిగా, మెచ్యూర్ లవర్ గా చాలా బాగా యాక్టింగ్ చేశాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలలో చాలా బాగా ఆకట్టుకున్నాడు.

శృతిహాసన్: శృతి ఈ సినిమా రావడం చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఒక లెక్చరర్ గా ఉంటూ మరో వైపు ప్రేమికురాలిగా చాలా బాగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో శృతి సింప్లి సూపర్.

అనుపమ, మడోన్నా వారి పరిధి మేరకు యాక్ట్ చేశారు. అలాగే బ్రహ్మజీ, ప్రవీణ్ నవ్వించారు. ఇక మధ్యలో వెంకటేష్ రావడం చాలా బాగుంది.

సాంకేతిక వర్గం:

ఇలాంటి ప్రేమ సినిమాకు ముఖ్యంగా కావలసింది సంగీతం. ఈ సినిమాకు గోపిసుందర్, రాజేష్ మురుగేశన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు దీనితో ఈ సినిమా మరో స్థాయికి వెల్లింది అని చెప్పాలి. అలాగే కార్తీకి ఘట్టమనేని కెమెరా పనితామా బాగుంది. ఇక ఎడిటర్ గా తన సీనియారిటీని మరో సారి చూపించాడు కోటగిరి వెంకటేశ్వరావు. ఇక చివరగా దర్శకుడు చందు గురించి చెప్పుకోవాలి తెలిసిన కథ అయినా ఎక్కడ ఎలాంటి పొరపాటు చేయకుండా చాలా చక్కగా కథని డీల్ చేశాడు. సితార బ్యానర్ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

  • నాగ చైతన్య
  • మ్యూజిక్
  • సినిమాటోగ్రఫీ
  • ఎడిటింగ్.

మైనస్ పాయింట్స్:

  • శృతి హాసన్ తో కొన్ని సన్నివేశాలు.

అలజడి రేటింగ్: 3.25/ 5

పంచ్ లైన్: మరోసారి మాయ చేసిన ‘ప్రేమ’మ్.

(Visited 3,406 times, 43 visits today)

Comments

comments