EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / కరీంనగర్ “సైకో బల్విందర్ సింగ్” నిజంగా ఉన్మాదేనా?

కరీంనగర్ “సైకో బల్విందర్ సింగ్” నిజంగా ఉన్మాదేనా?

Author:

విపరీతమైన మానసిక ఒత్తిడి వల్లే తల్లితండ్రులతో సహా 20 మందిపై దాడి చేసి పోలీసు కాల్పుల్లో మరణించిన బల్విందర్ సింగ్ అలా తయారయ్యాడనే కథనాలు  వినిపిస్తున్నాయి. బల్విందర్ చిన్నప్పటి నుంచీ మెరిట్ స్టూడెంట్ అంతే కాదు ఎంసెట్ లో జిల్లాలోనే 6 ర్యాంకు సాధించిన బెస్ట్ స్టూడెంట్ కూడా. బెంగళూరులొని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీ ఓరాకిల్ లో 18 లక్షల జీతం అందుకుంటూన్న బల్విందర్ ఈ మధ్యనే సివిల్స్ కి ప్రిపేర్ అయి విఫలం అయ్యాడు దాంతో ఎక్కువ ఒత్తిడి వల్లే కొన్నాళ్ళుగా అతని మానసిక పరిస్థితిలో మార్పు వచ్చినందున చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో ఉన్న ఒక సైక్రియాటిస్ట్ అతనికి ట్రీట్ మెంట్ చేస్తున్నాడని కథనాలు వినిపిస్తున్నాయి…

ఐతే నాలుగు రోజుల క్రితమే బల్విందర్ ఉద్యోగానికి సెలవు పెట్టి కరీంనగర్ వచ్చాడు.మూడు రోజులు బాగానే ఉన్నాడు. మధ్యలోనూ ఒకసారి ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి వెళ్ళొచ్చాడు. మంగళవారం ఉదయమే తల్లిదండ్రులతో ఏదో గొడవ జరిగింది.వారిని కత్తితో పొడిచి, వారిని బూతులు తిడుతూ ఇంటి బయటికి పరుగులు పెట్టాడు. ఎదురుగా ఉన్న వ్యాన్ అద్దాలు బద్దలు కొట్టాడు. అటుగా వస్తున్న వారిపై దాడి చేశాడు. అతడిని అదుపు చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా దాడి చేశాడు. అతడి దాడిలో దాదాపు 20 మందికి గాయాలయ్యాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టెబుల్ అలీ చేతి వేలును నరికేశాడు. ఇక లాభం లేదనుకున్న పోలీసులు అతడి కాళ్లపై కాల్పులు జరిపి అదుపులోకి తిసుకున్నారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

దీనిని బట్టి అతడి మానసిక స్థితిని బాగా ప్రభావితం చేసే ఘటన అంతకు కొద్దిసేపటికి ముందే జరిగి ఉండొచ్చని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇన్నాళ్లుగా అంత పెద్ద కంపెనీ లో అత్యధిక జీతానికి ఉద్యోగం చేస్తున్నాడంటే.. ఎప్పటి నుంచో అతనికి మానసిక సమస్యలు ఉండటం అనేది నిజం కాకపోవచ్చు, అతని మానసిక స్థితి అదుపులోనే ఉందని అర్ధం, అంటూ అనుమానం వెలిబుచ్చారు ఒక పోలీస్ అధికారి.

Comments

comments