EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / General / Video: తల్లి కళ్లెదుటే కొడుకుకి ఉరి వేసి…కూతురిని కర్రతో చావబాదిన కిరాతక తండ్రి..!

Video: తల్లి కళ్లెదుటే కొడుకుకి ఉరి వేసి…కూతురిని కర్రతో చావబాదిన కిరాతక తండ్రి..!

Author:

నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో మీరు చూసే ఉంటారు. అయిదేళ్ళుకూడా నిండని చిన్నారి మెడకి కాస్త పైకి తాడు కట్టి ఉరి వేసినట్టుగా వేలాడదీసి. పక్కనే మరో చిన్నారిని అత్యంత పాశవికంగా కర్రతో కొడుతూ హింసించే ఒక వ్యక్తి కౄరత్వాన్ని ఆ వీడియోలో చూసి గుండేలు కలచి వేసినట్టయ్యింది నెటిజన్లకు. తీవ్ర ఆగ్రహంతో అతన్ని శిక్షించాలంటూ ఆ దారుణమైన వీడియోని తమ తమ సోషల్ మీడియా పేజీలలో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసారు. ప్రతీ మనిషీ ఆ చిన్నారుల రోదనలకి చలించి పోయాడు… అతన్ని ఎలాగైనా పట్టుకొని శిక్షించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంతగా వైరల్ అయిన ఆ వీడియో చివరకు బాలల సంక్షేమ  సమితి కూడా పోలీసుల సాయంతో తీవ్రంగా దర్యాప్తు చేసి మరీ ఆ కిరాతక తండ్రిని ఎట్టకేలకు ఊచల వెనక్కి నెట్టారు…

రాజస్థాన్ రాష్ట్రంలోని రాజసమంద్ జిల్లా ఫుకియాథడ్ లో కన్న కొడుకు, కూతురిని తల్లిదండ్రులు ఇంట్లోనే కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతుంది. అల్లరి చేస్తున్నాడని.. ఇంట్లో బట్టలు చిందరవందరగా పడేసి పాడు చేస్తున్నాడని, చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా  ఐదేళ్ల కొడుకు లలిత్ ను తీవ్రంగా హింసించాడు తండ్రి చైన్ సింగ్. ఇంట్లో దూలానికి తాడు కట్టి.. ఉరి వేసినట్లు వేలాడదీశాడు. గొంతుకు తాడు బిగుస్తుండటంతో గిలగిలా కొట్టుకున్నాడు ఐదేళ్ల చిన్నారి లలిత్. మరోవైపు అప్పటికీ కోపం తగ్గని తండ్రి.. బెత్తంతో బాదేస్తున్నాడు. ఆ తర్వాత మూడేళ్ల కూతురు లాలాజవంతి ను చావగొట్టాడు. వీపుపై వాతలు పెట్టాడు. ఆ పక్కనే తల్లి ఉన్నా కనీసం వారించలేదు. ఈ వ్యవహారం మొత్తాన్ని చైన్ సింగ్ తమ్ముడు రావత్ వీడియో తీశాడు. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఈ వీడియో చూసి నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మరొవైపు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది బాలల సంక్షేమ సమితి.


బాలల సంక్షేమ సమితి వాళ్లు  ఘటనా స్థలానికి వెళ్లి విచారించగా… అక్కడ అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు ఎలాంటి వారని ప పిల్లలను ప్రశ్నిస్తే.. తండ్రి ఎప్పుడూ ఇలాగే కొడుతుంటాడని, తల్లి ఏం అనదు అనే సమాధానం వచ్చింది..దాంతో తండ్రి చైన్ సింగ్ పై   పోలీసులు  వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు.

Comments

comments