Home / Entertainment / కొత్త సాంగ్ కి “సై” అన్నాడు

కొత్త సాంగ్ కి “సై” అన్నాడు

Author:

Gangnam Style Psy

గంగ్నం స్టైల్ పాట గుర్తుంది కదా..! పాప్ చరిత్రలోనే భారీ హిట్‌లలో ఒకటిగా నిలిచింది ఈ పాట. ప్రతీ టీనేజర్ గంగ్నం స్టైల్ అంటూ ఊగిపోయాడు ప్రతీ పార్టీ లోనూ గుర్రం స్టెప్ ఇప్పటికీ వేస్తూనే ఉన్నారు.ఇప్పటికీ అతి తక్కువ సమయం లో అన్ని హిట్ లు ఉన్న సాంగ్ అదోక్కటే ఓవర్నైట్ లో “సై” ని ప్రపంచస్థాయి పాప్ సింగర్ని చేసిన పాట. 2012లో ‘గంగ్నమ్‌ స్టైల్‌’ పాటతో ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన ఈ కొరియన్ పాప్‌ సూపర్‌స్టార్‌ మరోసారి తనదైన డాన్సింగ్‌ స్టెపులతో ముంచెత్తాడు. తాజాగా అతను రూపొందించిన ‘డాడీ’ పాట.. యూట్యూబ్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది. సై మార్కు డాన్సులతో కొంత విచిత్రంగా, మరికొంత వినూత్నంగా ఉన్న ‘డాడీ’ పాటను యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 42 లక్షల మందికి పైగా వీక్షించారు.

ఇప్పుడు మరో సారి ఇంకొక తుఫాన్ తో వచ్చేసాడు “సై” విలియమ్‌ తీసిన ‘ఐ గాట్‌ ఫ్రమ్‌ ఇట్‌ మై మమ్మ’ పాటకు ‘మేల్‌’ వెర్షన్‌గా సై ‘డాడీ’ పాటను రూపొందించాడు. ఇందులో సై శిశువుగా, స్కూల్‌ విద్యార్థిగా, సల్సా డ్యాన్సర్‌గా వినూత్న అవతారాల్లో యానిమేటెడ్‌ లుక్‌తో కనిపిస్తాడు. ప్రసవ సన్నివేశంతో ఈ పాట ప్రారంభమవుతుంది. సంగీతం మొదలవ్వడంతో సై ముఖంతో కూడిన ఓ శిశువు జన్మిస్తాడు. దాంతో ‘ఐ గాట్‌ ఇట్‌ ఫ్రమ్‌ మై డ్యాడీ’ పాట మొదలవుతుంది. ఈ శిశువు పెద్దవాడై తన డ్యాన్స్‌ స్టెప్పులతో స్కూల్‌ విద్యార్థినులను, టీచర్‌ను, అమ్మాయిలను ఎలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటాడు అనే థీమ్‌తో పాట సాగుతుంది. అంతేకాకుండా ఇందులో సై బాలుడిగా, తండ్రిగా, తాతగా త్రిపాత్రభినయంతో స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తాడు.మరి ఈ ఆల్బం కి ఎన్ని హిట్ లు వస్తాయో ఇదెన్ని రికార్డులని తెచ్చుకుంటుందో చూడాలి మరి….

(Visited 136 times, 65 visits today)